జనసేన కోసం జబర్దస్త్ కమెడియన్ల ప్రచారంపై రోజా షాకింగ్ కామెంట్స్.. గెటప్ శ్రీను కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కలిసున్నవారు ఇప్పుడు ఏపీ ఎన్నికల సాక్షిగా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఏపీలో మంత్రి రోజా తాజాగా జబర్దస్త్ షోలో స్కిట్లు వేసే కమెడియన్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేయడం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జబర్దస్త్ కమెడియన్ లపై రోజా షాకింగ్ వ్యాఖ్యలు
పాపం వాళ్లంతా డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీకి ఎదురు వెళితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని భయంతోనే వాళ్లంతా జనసేనకు ప్రచారం చేస్తున్నారని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. వారంతా చిన్న చిన్న ప్రోగ్రామ్స్, స్కిట్లు చేసుకునే వారని పేర్కొన్న రోజా చేసిన వ్యాఖ్యలకు గెటప్ శ్రీను కౌంటర్ ఇచ్చారు.

రోజా వ్యాఖ్యలకు గెటప్ శ్రీను కౌంటర్
తామంతా పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంది కాబట్టే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నామని, తమను ఎవరు పార్టీ కోసం ప్రచారం చేయమని పిలవలేదని, తమపై ఎటువంటి ఒత్తిడి తీసుకు రాలేదని గెటప్ శ్రీను రోజా వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. తాము స్వచ్చందంగా జనసేన కోసం ప్రచారం చేస్తున్నట్టు గెటప్ శ్రీను తెలిపారు. మెగా ఫ్యామిలీకి ఎదురెళితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారన్న భయం తమకు ఎప్పుడు లేదన్నారు.
పిఠాపురంలో పవన్ కు లక్ష మెజారిటీ
అయినా మెగా ఫ్యామిలీ అటువంటిది కాదని గెటప్ శ్రీను వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల కంటే తాము బయట హీరోల సినిమాల్లోనే ఎక్కువ పాత్రలు చేశామని, ఎన్టీఆర్, నాని, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోలతో కలిసి పని చేశామని ఆయన తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పట్ల జనంలో ఎంతో అభిమానం ఉందని, అక్కడ ఆయన లక్ష మెజారిటీతో గెలుస్తాడని గెటప్ శ్రీను వెల్లడించారు.
పవన్ కోసం స్వచ్చందంగానే ప్రచారం
పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పూర్తి ఇష్టంతో తమకై తాము వచ్చే పని చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిని అన్నారు. గత 10 ఏళ్లుగా ఏపీ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఆ కష్టానికి ఫలితం ఉంటుందని తామంతా భావిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications