శ్రీవారి దర్శనం: తిరుమలలో వరుస కట్టిన మంత్రులు, ప్రముఖులు
చిత్తూరు: శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు వరుస కట్టారు. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, పీ నారాయణ, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తదితరులు తిరుమలకు వచ్చారు. వీరంతా ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
వీరికి నిబంధనల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు. హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు కూడా శ్రీవారిని దర్సించుకున్నారు.
కోలుకుంటున్న డాలర్ శేషాద్రి

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలరు శేషాద్రి ఆరోగ్యం కుదుట పడుతోంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో డాలర్ శేషాద్రి చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో డాలర్ శేషాద్రి శనివారం అస్వస్థతకు గురయ్యారు.
దేవుడి ఆశీస్సులు ఉంటాయి: నటి రాధిక
బెంగళూరు క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో ప్రముఖ నటి రాధిక కుమార్తె రాయని నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా రాధిక తన ఫేస్‌బుక్ ఖాతాలో కుమార్తె నిశ్చితార్థం ఫొటోను పోస్ట్ చేశారు. వారికి దైవం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయంటూ దీవించారు. రాయని, మిథున్‌ల నిశ్చితార్థం ఈనెల 24న చెన్నైలో జరిగింది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications