జగన్ ను నట్టేట ముంచిన ఆ ముగ్గురు - కళ్లకు గంతలు..!!

జగన్ ను ప్రజలు ఓడించారా. ఓడించాల్సిన పరిస్థితి జగన్ తెచ్చుకున్నారా. 2019 లో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు..అయిదేళ్ల కాలంలోనే అదే జగన్ ను 11 సీట్లకు ఎందుకు పరిమితం చేసారు. దీని వెనుక కారణాలు ఏంటి. 40 శాతం ఓటింగ్ దక్కింది. కానీ, 11 సీట్లకే పరిమితం అయ్యారు. పార్టీలో జగన్ ను అభిమానించే ప్రతీ ఒక్కరూ తమ నేత చేసిన పొరపాట్లే కారణంగా చెబుతున్నారు. జగన్ నమ్మిన ముగ్గురే దీనికి ప్రధాన బాధ్యులని మండి పడుతున్నారు.

జగన్ తొలి వైఫల్యం
జగన్ పైన చంద్రబాబు కంటే సమర్ధవంతంగా రాణిస్తారనే ఆశలతో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేసారు. అధికారం చేపట్టిన కొద్ది నెలలకే అమరావతి మొదలు అన్ని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో అగ్రహం మొదలైంది. వరుసగా జగన్ చేసిన అనేక తప్పిదాలు ఈ భారీ నష్టానికి కారణమయ్యాయి. జగన్ ప్రజలను ఏనాడు కలవలేదు. కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు కలిసే అవకాశం ఇవ్వలేదు. కేడర్ గురించి ఆలోచన చేయలేదు. బటన్ నొక్కటం కోసం మాత్రమే సీఎం అయినట్లుగా వ్యవహరించారు. సజ్జల లేదా ధనుంజయ రెడ్డి వద్దే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవాలి. పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళల్లో అండగా నిలిచిన కేడర్ కు ఎక్కడా ప్రాధాన్యత దక్కలేదు.

Misleading Reports by IPAC The Catalyst for YS Jagan s 2024 Election Debacle

నట్టేట ముంచారు
ప్రజలను నేరుగా ఖాతాల్లో డబ్బులు వేయటం, వాలంటీర్లే సైన్యంగా జగన్ ఆలోచన సాగింది. ఎమ్మెల్యేలు అదుపు తప్పినా పట్టించుకోలేదు. జిల్లాలకు పర్యటనలక వెళ్లిన సమయంలో పరదాలు కట్టారు. ఏ సభ లోనూ చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేదు. ప్రతిపక్షాలు, మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తున్నా...తిప్పి కొట్టలేదు. సీనియర్లు మాట్లాడలని భావించినా..తాడేపల్లి లోని కొందరు రిమోట్ కంట్రోల్ లాగా పని చేసారు. ఎమ్మెల్యేలు ఏ పనితో వచ్చినా ధనుంజయరెడ్డి అనుమతి, ఆయ నిర్ణయం పైనే పనులు జరిగేవి. ఉద్యోగ సంఘాలతో సహా ఏ ప్రధాన సమస్య అయినా సజ్జలకు అప్పగించటం ఏ ఒక్కరికీ రుచించలేదు. ఉద్యోగ సంఘాలతో సజ్జల వ్యవహరించిన తీరు పైన ఆ సంఘాల నేతల్లో ఆగ్రహం పెంచింది.ఇక..రాష్ట్రంలో మౌళిక వసతుల కల్పన పైన ఆలోచన చేయలేదు. ఉపాధి కల్పించినా చెప్పుకోలేదు.

గుడ్డిగా నమ్మిన ఫలితం
జగన్ ప్రజల మూడ్ తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న ఐప్యాక్ పూర్తిగా జగన్ కళ్లకు గంతలు కట్టింది. అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో జగన్ కు మరోసారి 151 సీట్ల పైన ఆశలు కల్పించింది. జగన్ ప్రజలు, పార్టీ నేతలతో ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారో..అప్పుడే వాస్తవాలు జగన్ వద్దకు చేరలేదు. బయట జరుగుతున్న ప్రచారం..ప్రజల అభిప్రాయాలను సీరియస్ గా తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా కరోనా సమయంలో సమర్దంగా వ్యవహరించిన జగన్ ఆ తరువాత పాలనా వ్యవస్థ పైన అసలు పట్టు ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్లుగా నిర్ణయాలు కనిపించాయి. చివరకు ఓటర్లు తిరస్కరించారని తెలిసినా..ఐ ప్యాక్ జగన్ తో 151 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తున్నామని జగన్ ను నమ్మించింది. అదే బయటకు చెప్పించింది. కానీ, ఇప్పుడు ఐ ప్యాక్ ప్యాకప్ చెప్పింది. జగన్ రాజకీయ భవిష్యత్..పార్టీని సర్వస్వంగా భావిస్తున్న కోట్లాది మందికి తీరని ఆవేదన మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+