జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే, శుభమని హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ యర్రగొండపాలెం శాసన సభ్యుడు సురేష్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభ ప్రకాశం జిల్లా మాచర్లలో సాయంత్రం ఉంది. ఈ సభలోనే ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా చేరనున్నారని తెలుస్తోంది.
విభజనపై స్టే నిరాకరణ శుభపరిణామం: హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుస్టే నిరాకరించడం శుభపరిణామమని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు అన్నారు. న్యాయస్థానాలను సాకుగా చూపించి రాజకీయాలు చేయాలనుకునే వారికి ఇది చెంప పెట్టు అ్నారు. ఇప్పటికీ తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే మూర్ఖత్వమే అవుతుందన్నారు.

ఎమ్మెల్యేగానే: కిషన్ రెడ్డి
తనకు లోకసభకు పోటీ చేయాలన్న ఆసక్తి లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శుక్రవారం చెప్పారు. అధిష్ఠానం ఆదేశించినా తాను ఎంపీగా పోటీ చేయనని అన్నారు. తన సొంత నియోజకవర్గమైన అంబర్‌పేట నుండే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని, ఇరు ప్రాంతాల్లోను బిజెపికి మంచి ఫలితాలు వస్తాయన్నారు.
తెలంగామ వారికి నష్టం: కోదండరామ్
హైదరాబాదు, కూకట్‌పల్లిలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టీయూ)లో నియామకాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియామకాలు చేపడితే తెలంగాణ వారికి నష్టం జరుగుతుందన్నారు. వర్శిటీ అధికారులు నియామకాలు చేపడితే ఛలో జెఎన్టీయూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే: కుతూహలమ్మ
తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నానని కుతూహలమ్మ చెప్పారు. కిరణ్ పార్టీలో చేరేది లేనిది త్వరలో చెబుతానని అన్నారు.












Click it and Unblock the Notifications