జనసేన కండువాతో ఛైర్మన్ వద్దకు వైసీపీ ఎమ్మెల్సీ, రాజీనామాతో..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత అనేక మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసారు. కూటమి పార్టీల్లో చేరారు. అందు లో రాజ్యసభ సభ్యులతో పాటుగా ఎమ్మెల్సీలు ఉన్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాల పై ఛైర్మన్ నిర్ణయం పెండింగ్ లో ఉంచారు. తాజాగా వారికి నోటీసులు జారీ చేసారు. ఇక, ఇప్పుడు సభ లెక్కల ప్రకారం వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మెడలో జనసేన కండువా తో ఛైర్మన్ ను కలిసారు. రాజీనామా ఆమోదించాలని కోరారు.

ఏపీలో శాసన మండలి కేంద్రంగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడి కూటమి పార్టీల్లో చేరారు. వైసీపీ నుంచి మండలిలో సభ్యులుగా కొనసాగుతున్న ఆరుగురు రాజీనామాలు చేసారు. తమ రాజీనామాలు ఆమోదించాలని గతంలోనే ఛైర్మన్ ను కోరారు. కాగా.. గత వారం వారికి ఛైర్మన్ నోటీసులు జారీ చేసారు. కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‎కు నోటీసులు జారీ చేసిన ఛైర్మన్ ఈ రోజున విచారణకు రావాలని సూచించారు. అదే విధంగా రాజీనామా చేసిన రో ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణకు సైతం ఈ రోజునే విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. దీంతో వెంకట రమణ మెడలో జనసేన కండువా తో ఛైర్మన్ ఎదుట హాజరయ్యారు. రాజీనామా ఆమోదించాలని కోరారు. ఎవరి ఒత్తిడితో అయినా రాజీనామా చేసారా.. స్వచ్చందంగా రాజీనామా చేసారా అంటూ ఛైర్మన్ ప్రశ్నించారు.

mlc-jayamangalam-venkata-ramana-meets-council-chairman-for-acceptance-of-his-resignation-here-the

రాజీనామా ఆమోదించాలని వినతి

తాను పార్టీకి.. వైసీపీకి రాజీనామా చేసానని జయమంగళం వెంకట రమణ వివరించారు. తన పైన ఎవరి ఒత్తిడి లేదని తేల్చి చెప్పారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. దీంతో.. ఇప్పుడు ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అటు శాసనసభలో 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ.. ఇప్పుడు మండలిలో ఆధిక్యంలో ఉంది. కాగా.. ఆరుగురు సభ్యుల రాజీనామా పైన మండలి ఛైర్మన్ తీసుకునే నిర్ణయం ఆధారంగా వీరి భవితవ్యం ఏంటనేది స్పష్టత రానుంది. గతంలోనే వైసీపీకి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిశారు. రాజీనామా అంశంపై ఆరుగురు ఎమ్మెల్సీలు వివరణ ఇచ్చారు. తమ రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్‌ను ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత.. చైర్మన్‌ ను కలిసిన వారిలో ఉన్నారు. తాము స్వచ్ఛందంగా రాజీనామా చేసామని స్పష్టం చేసారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని ఇంకా ఎన్నిసార్లు అడిగినా తమది ఇదే సమాధానమని వారు స్పష్టం చేశారు. 2024 ఆగస్టులో ఈ ఎమ్మెల్సీలు రాజీనామా చేసారు. ఇప్పుడు, ఛైర్మన్ వారికి నోటీసులు ఇవ్వటంతో.. మిగిలిన వారి వివరణ తీసుకున్న తరువాత రాజీనామాల పైన తన నిర్ణయం ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+