మారిన ఏపీ గ్రూప్స్ సిలబస్ ఇదే: తెలంగాణ చరిత్ర తొలగింపు

హైదరాబాద్/విజయవాడ: నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(ఏపీపీఎస్సీ) కొత్త రిక్రూట్‌మెంట్లకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయాలని తర్వాత గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఇప్పటికే సేకరించింది.

కాగా, జూన్ నాటికి ఉన్న ఖాళీల స్థితిని నవీకరించి తర్వాత నోటిఫికేషన్ల జారీకి వీలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం వివిధ కేటగిరి పోస్టులకు కొత్త సిలబస్‌ను ప్రకటించింది. గత నెల రోజులుగా అభ్యర్ధులు కొత్త సిలబస్‌పై అభిప్రాయాలను తెలుపుతునే ఉన్నా.. గడవును మార్చి 10 నుండి 15వ తేదీ వరకూ పొడిగించినట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి ఉదయ భాస్కర్ తెలిపారు.

గ్రూప్-1కు ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను కొత్తగా చేసిన మార్పులను మొత్తం 23 పేజీల ముసాయిదాను విడుదల చేశారు. అలాగే గ్రూప్-2 సర్వీసులకు 11 పేజీలు, గ్రూప్-4 సర్వీసులకు 4 పేజీల ముసాయిదాలను విడుదల చేశారు.

Modern T-history Out of APPSC Syllabus

కాగా, కొత్త సిలబస్‌లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని పూర్తిగా తొలగించారు. కేవలం ఆంధ్రా ప్రాంత అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, రాష్ట్రంలో ఏకపార్టీ పాలనకు ఫుల్‌స్టాప్ పడిన తీరు, ప్రాంతీయ పార్టీలతో దేశంలో వచ్చిన మార్పులు, డ్వాక్రా గ్రూప్‌లు, సూక్ష్మ రుణ పథకాలు, ప్రభుత్వ పథకాలు కొత్తగా సిలబస్‌లో చేరాయి.

గ్రూప్-1కు ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లీషు అర్హత పరీక్షతో పాటు ర్యాంకులు కేటాయించేందుకు ఐదు పేపర్లు ఉంటాయి.

తొలి పేపర్ జనరల్ ఎస్సే, రెండో పేపర్ సెక్షన్-1 కల్చర్ హెరిటేజ్, సెక్షన్-2లో సోషల్ కల్చరల్ హిస్టరీ, సెక్షన్-3లో ఇండియన్ కానిస్టిట్యూషన్, పేపర్-3లో సెక్షన్-1లో ప్లానింగ్ ఇన్ ఇండియా, సెక్షన్-2లో భూ సంస్కరణలు, సెక్షన్-3లో ఎపీ ఎకానమి, పేపర్-4లో సెక్షన్ -1లో రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్షన్-2లో లైఫ్ సైన్సెస్, సెక్షన్-3లో డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్, పేపర్-5లో డాటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఉంటాయి.

ఇక గ్రూప్-2లో మూడు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ, ప్లానింగ్ ఇన్ ఇండియా, గ్రూప్-4కు రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ మీద, రెండోది సెక్రటేరియల్ ఎబిలిటీస్ మీద ఉంటాయి.

తెలంగాణ సిలబస్‌ను తొలగించి ఆంధ్రా సిలబస్‌ను పెంచడం మినహా పెద్దగా మార్పులు లేవని, కనుక అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. గతంలో ఉన్న వాటినే కాస్తా వేరు చేసి ప్రత్యేక యూనిట్లుగా కూడా పొందుపరిచినట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యావేత్తలు, నిపుణుల నుంచి సూచనలు తీసుకున్నామని చెప్పారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో మారిన సిలబస్‌కు సంబంధించిన అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+