విశాఖ వెళ్తున్నాం - ప్రధానితో సీఎం జగన్ చర్చలు : పొత్తులపైనా - పీఎం హామీ..!?

ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిగాయి. ఏపీకి చెందిన పాలనా పరమైన వ్యవహారాలు - రాజకీయ అంశాల పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తున్నట్లు ప్రధానికి సీఎం వివరించారని సమాచారం. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు. పోలవరం నిధులతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపైన చర్చించారు. ఏపీలో 2014 తరహా పొత్తుల అంశంపైనా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. పూర్తిగా సహకారం అందిస్తామంటూ సీఎంకు హామీ దక్కినట్లు తెలుస్తోంది.

విశాఖ నుంచి పాలన దిశగా

విశాఖ నుంచి పాలన దిశగా

మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే, ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే అవకాశం ఉపయోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందు కోసం వచ్చే ఉగాది నుంచి విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని నేడు ప్రధానితో జరిగిన భేటీలోనూ వివరించారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు తిరిగి ఏపీలో రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారని తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రధానంగా పోలవరం అంశం పైన ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టునుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. అందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందన్నారు. ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని వివరించారు. ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేస్తే పనులు వేగంగా ముందుకెళ్తాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు

తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు

తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. కష్టాల్లో ఉన్న ఏపీ జెన్ కోకు ఈ బకాయిలు అవసరమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోందని ప్రధానికి వివరించారు. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోందన్నారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు.

రాజకీయ వ్యవహారాల పైనా చర్చ..!?

రాజకీయ వ్యవహారాల పైనా చర్చ..!?

ప్రధానితో పాలనా వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 లో మాదిరి ఏపీలో తిరిగి పొత్తుల దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాల పైన వీరిద్దరూ చర్చించారని చెబుతున్నారు.కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని వివరించిన ముఖ్యమంత్రి.., ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చెప్పిన అంశాల పైన ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పూర్తి సహకారం అందిస్తామని హామీ దక్కినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+