ఏ అన్న ఫొటో ఉన్నా లేకున్నా.. మోడీ ఫొటో మాత్రం ఉండాలి: నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్
విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఆదివారం కొనసాగింది. అనకాపల్లి తాళ్లపాలెంలోని రేషన్ డిపో లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరాపై ఆరా తీశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం గురించీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ నాథ్‌ను వివరించమన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రేషన్ డిపోలలో ఎవరికి ఇష్టమొచ్చిన ఫోటోలు వారు పెడితే కుదరదు. ఏ అన్న ఫొటో ఉన్నా లేకున్నా.. ప్రతీ రేషన్ డిపోలో మన అందరి అన్న నరేంద్ర మోడీ ఫోటో ఉండాలని నిర్మలా సీతారామన్ స్పషం చేశారు. తాజాగా చేసిన కేంద్రమంత్రి కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
50 కోట్ల మందికి వ్యాక్సినేషన్
Recommended Video
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. చిన్న వాల్తేర్‌లో కోవిడ్ టీకా కేంద్రాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. మరో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.












Click it and Unblock the Notifications