ఏపీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల- ఒక్క రోజులో 2 వేలకు పైగా... 70 మృతులు..
ఏపీలో కరోనా ప్రభావం మొదలయ్యాక పెరుగుతూ వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతీ రోజూ పదిన్నర వేలు దాటిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో గత 24 గంటల్లో తొలిసారిగా కొత్త కేసుల సంఖ్య 2 వేలకు పైగా తక్కువగా నమోదైంది. కరోనా ప్రభావం మొదలయ్యాక కేసుల వ్యత్యాసం ఇంత భారీగా రోజువారీ నమోదు కావడం కూడా ఇదే తొలిసారిగా తెలుస్తోంది.
ఏపీలో గత 24 గంటల్లో 8368 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎప్పటిలాగే తూర్పుగోదావరి గరిష్ట కేసులు, కృష్ణాజిల్లా కనిష్ట కేసుల రికార్డు నిలబెట్టుకున్నాయి. గరిష్టంగా తూర్పుగోదావరి జిల్లాలో 1312 కేసులు నమోదు కాగా.. కృష్ణాలో కనిష్టంగా 193 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో అత్యధికంగా పశ్చిమగోదావరి (950), నెల్లూరు (949), చిత్తూరు (875) కేసులు నమోదయ్యాయి. 500 కంటే తక్కువ కేసుల జాబితాలో కృష్ణా జిల్లాతో పాటు కర్నూలు (316), విశాఖ (405), ప్రకాశం (419) ఉన్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ 5 లక్షల కేసులు నమోదు కాగా... 4 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 97 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 70 మంది చనిపోయారు. వీరిలో అత్యధికంగా ప్రకాశం (10), గుంటూరు (9), చిత్తూరు (8), కడప (7) పశ్చిమగోదావరి (7), కృష్ణాలో (5), అనంతపురం (4), కర్నూలు (4), శ్రీకాకుళం (4), విశాఖ(4), తూర్పుగోదావరి (3) మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4487కు చేరింది.












Click it and Unblock the Notifications