బెదిరింపు: మోత్కుపల్లి, హీరోయిన్లతో: మురళీమోహన్

Mothkupally speech in Mahanadu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం మహానాడులో మాట్లాడారు. తెలంగాణ టిడిపి నేతగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పార్టీ నుండి బయటకు రావాలని తనను ఎన్నో రకాలుగా భయపెట్టారని మోత్కుపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి పైన నిప్పులు చెరిగారు.

తాను ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. చదువుకున్న యువతకు టిక్కెట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. తెలంగాణ టిడిపి నేతగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తాను నిలదొక్కుకున్నానని చెప్పారు. తనను ఎందరు అన్నా చంద్రబాబు పక్కనే నిలబడ్డానని చెప్పారు. ఒక యజ్ఞం చేసినట్లుగా తెరాసకు వ్యతిరేకంగా పోరాడానని చెప్పారు.

టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. టిడిపిలో ఉన్నందుకు దాడులకు కూడా ప్రయత్నించారని, టిడిపి జెండా పట్టుకోవడానికి భయపడే పరిస్థితిని తెచ్చారన్నారు. అయినప్పటికీ తాము బెదరలేదన్నారు. ఇబ్బందులు ఎదుర్కొని నిలబడ్డామన్నారు. తాము పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలమన్నారు. ఆస్తి హక్కులో మహిళలకు వాటా కల్పించిన నేత ఎన్టీఆర్ అన్నారు. సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి రావడం శుభపరిణామమన్నారు. జగన్ ప్రజల సొమ్మును దోచుకున్నారని తాను విజయమ్మకు చెప్పానన్నారు. దోచుకోవడం సరికాదని చెప్పానన్నారు.

ఇదే పండుగ రోజు: మురళీ మోహన్

ఎన్నో పండుగలనున్నప్పటికీ టిడిపికి ఎన్టీఆర్ పుట్టిన రోజే పెద్ద పండుగ అని మురళీ మోహన్ అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి పుట్టబోడన్నారు.

పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఆయన అద్భుతంగా నటించారన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో... హీరోయిన్లతో డ్యూయెట్లు పాడే వారు కాంగ్రెసుతో పోటీ పడటమేమిటని అందరు అన్నారని చెప్పారు. కొండతో గొర్రెపిల్ల ఢీకొంటుందని ఎద్దేవా చేశారన్నారు. కానీ ఎన్టీఆర్ కొండవీటి సింహమని, ఏనుగు కుంభస్థలాన్ని కూడా కొట్టగలనని నిరూపించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+