2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం వారికే - ఎంపీ సీఎం రమేష్..!!
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో జోస్యం చెప్పారు. జగన్ సర్కార్ తీరుపై బీజేపీ సీరియస్‌గా ఉందన్నారు. ఉపేక్షించే పరిస్థితిలో లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సీఎం రమేష్, సుజనా చౌదరి సమావేశమయ్యారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం తరువాత కొత్త సమీకరణాలు తెర పైకి వచ్చాయి. ఇప్పుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా ఆసక్తి కర చర్చ మొదలైంది.

బీజేపీతో పొత్తు ఉన్న పార్టీకే: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు ఉన్న పార్టీకే అధికారం దక్కుతుందని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీతో ప్రస్తుతం జనసేన పొత్తు కొనసాగిస్తోంది. తమ రెండు పార్టీలు టీడీపీతోనూ కలుపుకొని వెళ్లాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. ఇదే అంశాన్ని తాజాగా ఢిల్లీ పర్యటనలో బీజేపీ ముఖ్య నేతల వద్ద ప్రతిపాదించారు. కానీ, వారి నుంచి స్పష్టత రాలేదని సమాచారం.
కర్ణాటక ఎన్నికల తరువాత ఈ అంశం పైన బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయానికి అనుగుణంగా పవన్ రాజకీయ పొత్తుల పైన స్పష్టత ఇవ్వనున్నారు. జనసేన తమతోనే కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని ఆ రెండు పార్టీల నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ తాజా ప్రతిపాదన: ఇప్పుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. జనసేన బీజేపీని కాదని, టీడీపీ వైపు వెళ్లేందుకు సిద్దమయ్యారు. చివరి ప్రయత్నంగా బీజేపీతో మూడు పార్టీల పొత్తుల అంశం పైన ప్రతిపాదన చేసారు. ఈ సమయంలో బీజేపీ నేతలు ఏపీలో పొత్తుల అంశంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ కోరుకున్న విధంగా మూడు పార్టీల పొత్తుకు బీజేపీ సిద్దం అవుతోందా..
లేక, జనసేనతో మాత్రమే పొత్తు కొనసాగించాలని కోరుకుంటుందా అనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2014 తరహాలో మూడు పార్టీల కలయిక దిశగా టీడీపీ శ్రేయోభిలాషులు ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఏపీలో పొత్తులు ఫైనల్ కానున్నాయి.
2014 ఫార్ములా రిపీట్ అయ్యేనా: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇటు ఏపీలో పాలన పైన విమర్శలు చేస్తూనే..ఏపీలో అధికారం గురించి వ్యాఖ్యలు చేసారు. జగన్ సర్కార్‌కు రైతుల సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 వసూలు చేస్తోందని విమర్శించారు. ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు.
టీడీపీతో పొత్తుకు అవకాశం లేదని బీజేపీ నేతలు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. పొత్తుల పైన అంతిమ నిర్ణయం ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమితి షా నిర్ణయానికి అనుగుణంగా ఉండనుంది. దీంతో...ఈ పొత్తుల అంశం ఇప్పుడు రాజకీయంగా మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications