సాయిరెడ్డి ఆపరేషన్ బిగిన్స్, బాలినేనితో భేటీ - కీలక మంత్రాంగం..!!

వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఆపరేషన్ టీడీపీ ప్రారంభించారు. మాజీ మంత్రి బాలినేనితో సమావేశమయ్యారు. పార్టీ సమన్వయకర్త పదవికి బాలినేని రాజీనామా చేసారు. ఆ స్థానంలో కీలకమైన జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆ జిల్లాల పరిస్థితుల పైన బాలినేనితో సాయిరెడ్డి చర్చించారని సమాచారం. సీఎం జగన్ ఇప్పటికే బాలినేనితో రెండు సార్లు మాట్లాడారు.

బాలినేని - సాయిరెడ్డి సమావేశం : వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తిరిగి కీలక బాధ్యతల్లో నిమగ్నయ్యారు. మాజీ మంత్రి బాలినేనితో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త పదవికి బాలినేని రాజీనామా చేసారు. ఆ తరువాత సీఎం జగన్ ఇదే విషయం పైన బాలినేనితో రెండు సార్లు చర్చలు చేసారు. అయినా బాలినేని మెత్తబడలేదు.

vijaysaireddybalinenisrinivasareddy1

నిర్ణయం వెనక్కు తీసుకోలేదు. తాను తన నియోజకవర్గానికే పరిమితం అవుతానని స్పష్టంగా చెప్పారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో టీడీపీ దెబ్బ కొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొంది. ఆ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త ఇంఛార్జ్ లను నియమించింది.

పార్టీ బాధ్యతలపై మంత్రాంగం : బాలినేని సమన్వయకర్త బాధ్యత నుంచి తప్పుకున్న తరువాత..నెల్లూరు జిల్లా వ్యవహారాలను ఎవరికీ అప్పగించలేదు. నెల్లూరు, ప్రకాశం బాధ్యతలను ఎంపీ విజయ సాయిరెడ్డికి అప్పగిస్తారని కొంత కాలంగా పార్టీలో ప్రచారం సాగుతోంది. అధికారికంగా ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ సమయంలో హైదరాబాద్ లో బాలినేని ఇంటికి వెళ్లిన సాయిరెడ్డి దాదాపు రెండు గంటల పాటు మంతనాలు జరిపారు.

ప్రకాశం జిల్లా పార్టీ నేతలు హాజరయ్యారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాల పైన చర్చించినట్లు తెలుస్తోంది. అటు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ పార్టీలో అవసరమైన బాధ్యతల మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

vijaysaireddybalinenisrinivasareddy1

మార్పుల దిశగా సీఎం కసరత్తు : టీటీడీ ఛైర్మన్ గా జంగా క్రిష్ణమూర్తిని నియమించాలని సీఎం నిర్ణయించారు. అదే సమయంలో బోర్డు సభ్యుల నియామకం పైనా కసరత్తు సాగుతోంది. సాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు పార్టీ సమన్వయకర్తలు బాధ్యతల నిర్వహణలో వస్తున్న సమస్యలను సీఎంకు వివరించారు.

దీంతో, వారి స్థానంలో పార్టీ సమన్వయ బాధ్యతలను ఇతరులకు అప్పగించేలా నిర్ణయాలు వెలువడనున్నాయి. బాలినేని అభిప్రాయం మరోసారి తెలుసుకున్న తరువాత సాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు నేరుగా సాయిరెడ్డి - బాలినేనితో భేటీ అయినట్లు చెబుతున్నారు. పార్టీ పరంగా నియామకాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+