ఏ1 గా చంద్రబాబు, ఏ2గా ఉమా - పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు..!!
టీటీడీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. పుంగనూరులో జరిగిన ఘటనలో చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విధ్వంసం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటికే హోం మంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు. ఇప్పుడు ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజకీయ కలకలం:పుంగనూరులో జరిగిన దాడుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీని పైన అధికార - ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా మంత్రులు చెబుతూ వచ్చారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, A3గా అమర్నాథ్‌రెడ్డి.. FIRలో మరో 20 మంది తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పోలీసులను హెచ్చరిస్తూ ...కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయనేది ప్రధాన అభియోగం.

చంద్రబాబు ఏ1గా నమోదు:గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో చంద్రబాబు పర్యటించారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా అప్పటికప్పుడు వేరే రూట్‌ను చంద్రబాబు ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం దారుణమని ఏపీ మంత్రులు చెబుతున్నారు. పుంగనూరు ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఐపీసీ 128బీతో పాటు 332,353,147,148 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటి వరకు 277 మంది పైన కేసు నమోదు చేసారు. రెండు ఎఫ్ఐఆర్ లు ఫైల్ చేసారు. ఒక ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఏ1గా చేర్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి రాజకీయ వివాదంగా మారుతోంది.

కొనసాగుతున్న అరెస్టులు:కాగా, పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది.
పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications