గేరు మార్చిన వర్మ, అసలు లక్ష్యం..!!
పిఠాపురం కేంద్రంగా రాజకీయం హీటెక్కింది. తాజాగా ఫ్లెక్సీ ఏర్పాటు వివాదం వర్మ వర్సస్ జనసేన గా మారుతోంది. జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు - వర్మ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. రెండు పార్టీల మధ్య ఘర్షణగా మారుతోంది. తాము దత్తత వచ్చిన నేతలం కాదని.. పిఠాపురంలోనే పుట్టి పెరిగామని వర్మ చేసిన కామెంట్స్ తో జనసేన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. వర్మ లక్ష్యం వేరేగా ఉందని.. పవన్ ను ఉద్దేశ పూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ముద్రగడ కుమార్తె చేసిన ట్వీట్ ఈ వివాదం వేళ మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
పిఠాపురంలో తాజాగా వర్మ - జనసేన నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం కొత్త మలుపు తీసు కుంది. వివాదం వేళ వర్మ చేసిన దత్తత రాలేదనే వ్యాఖ్యలు రాజకీయంగా మంట పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పైన ముద్రగడ కుమార్తె క్రాంతి సీరియస్ గా స్పందించారు. గతంలోనూ పవన్ కారణం గానే వర్మకు ఎమ్మెల్సీ రావటం లేదనే వార్తల పైన క్రాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక, ఇప్పుడు అదే స్థాయిలో వర్మను లక్ష్యంగా చేసుకొని క్రాంతి ట్వీట్ చేసారు.
అందులో.. వర్మ గారూ, మీ సొంత ఉద్దేశాలు మీకు ఏమాత్రం అర్థం కానట్లుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడం ప్రారంభించినప్పటి నుండి మీ వైఖరి చాలా వింతగా ఉంది. ఎలాగైనా సరే ఏదో ఒక గొడవ సృష్టించడమే మీ ఏకైక పని అన్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు, పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీ బ్యానర్లపై ఉన్న ఫోటోల గురించి ఈ రాద్ధాంతం అంతా ఎందుకు? గత రెండేళ్లలో, పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ₹600 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టారని గుర్తు చేసారు.

వర్మ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు
https://twitter.com/kr_barlapudi/status/2046586511509033235దీనికి కొనసాగింపుగా.. అంతేకాకుండా, ఆ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆయన ఇప్పటికీ ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు, అవునా? అయినప్పటికీ, వర్మ గారి ప్రవర్తన మాత్రం ప్రతి మాటలోనూ, ప్రతి చర్యలోనూ పవన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది.పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అని, జనసేన అధినేత అని, అలాగే NDA కూటమిలో భాగస్వామి అని మీరు మర్చిపోయారా? జనసేన పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే మీరు ఇలా ప్రవర్తిస్తే, దీనిని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వర్మ గారి గురించి ప్రజలు ఇప్పటికీ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
కూటమిలో విభేదాలు సృష్టించడానికి వర్మ గారు ప్రయత్నిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి; ఆయన చర్యలు కూడా ఆ అనుమానాలనే బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఒకవేళ ఏవైనా విభేదాలు ఉంటే, వాటిని మీ పార్టీ అంతర్గతంగానే చర్చించుకోవాలి తప్ప, ఇలా ప్రవర్తిస్తూ వార్తల్లోకి ఎక్కడం సరైన పద్ధతి కాదు. కనీసం ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి, వర్మ గారూ... అంటూ క్రాంతి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications