స్థానిక ఎన్నికల్లో 2024 ఫార్ములా వర్తించదు, జనసేన సత్తా చాటుతాం- మనోహర్..!!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని క్షేత్ర స్థాయిలో కూటమి విజయం కోసం పని చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సీట్ల కేటాయింపు పైన కొత్త ఫార్ములా సిద్దం చేసినట్లు చెబుతున్నారు. కాగా.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి సీట్ల పైన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

మంత్రి మనోహర్ స్థానిక ఎన్నికల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జనసేన బలాబలాలను బట్టి పోటీ చేస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేసారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఉంటుందని చెబుతూనే... అసెంబ్లీ ఎన్నికల సమయంలో తరహాలోనే సీట్లను తగ్గించుకొనే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు సిద్ధమని చెబుతూనే.. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసారు. కూటమితో పొత్తు అనేది అప్పటి పరిస్థితులపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గా వవరించారు. అదే లెక్కలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం సరికాదని చెప్పుకొచ్చారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని మనోహర్ గుర్తుచేశారు.

nadendla-manohar-made-crucial-comments-over-seat-sharing-for-alliance-parties-in-local-body-electio

జనసేన బలం ఉన్న చోట పోటీ

పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన జనసైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే, జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో నాడు జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని.. రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయంగా వివరించారు. ఇప్పుడు పార్టీ శ్రేణుల ఆవేదన అర్దం చేసుకొని.. పార్టీ నాయకత్వం మరింతగా పెంచుకునే విధంగా స్థానిక ఎన్నికల్లో నిర్ణయాలు ఉంటాయని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీలో మహిళలు.. యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే.. జనసేన కు బలం ఉన్న చోట పోటీ చేసే విధంగా.. సమన్వయంతో పోటీ చేస్తామని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+