షర్మిలపై దుష్ప్రచారం: బాలయ్య ఫస్ట్ రియాక్షన్: జగన్‌కు అద్దిరిపోయే కౌంటర్..!!
YS Jagan Mohan Reddy: తన కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఘాటుగా స్పందించారు. కుటుంబ బాంధవ్యాలు, మానవత విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, రాజకీయాల్లో చంద్రబాబు ఎదిగిన తీరును చూస్తే ఇది ఎవరికైనా స్పష్టంగా అర్థమౌతుందని చెప్పారు.
చంద్రబాబు తన చెల్లెలి మీద దుష్ప్రచారం చేయించాడంటూ ఆరోపించారు జగన్. గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో గల నందమూరి బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే భవన్ నుంచి వెబ్‌సైట్లల్లో తప్పుడు రాతలు రాయించలేదా?, దుష్ప్రచారం చేయలేదా? పోలీసుల దర్యాప్తులో ఇది తేలలేదా? అని ప్రశ్నించారు.

అప్పట్లో చంద్రబాబుపై షర్మిల చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను జగన్ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. బాలకృష్ణ ఆఫీస్ నుంచి తనపై దుష్ప్రచారం జరిగిందంటూ షర్మిల స్పష్టం చేయడం ఆ వీడియోలో కనిపించింది. దీనికి ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనీ అన్నారు.
వైఎస్ జగన్ చేసిన ఈ ఆరోపణలపై ప్రముఖ నటుడు, హిందూపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా స్పందించారు. అప్పట్లో షర్మిలపై అసత్య ప్రచారాన్ని చేసిందెవరు, చేయించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసనని వ్యాఖ్యానించారు.
ఈ అసత్య ప్రచారాన్ని వాళ్లే పట్టించుకోనప్పుడు తానెందుకు పట్టించుకోవాలంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైఎస్ఆర్సీపీ బహిష్కరించడాన్నీ తప్పుపట్టారు బాలయ్య. సెటైర్లు వేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిలో వాళ్ల మనుషులను పెట్టారని గుర్తు చేశారు.
గెలిపించుకోవానికి ఈ ఒక్కరోజైనా అసెంబ్లీకి వస్తారు పాపం.. అని ఎద్దేవా చేశారు. వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసమైనా వస్తారని చురకలు అంటించారు. అదంతా వృధా ప్రయాసేనని, ఇవ్వాళ కూడా రాకుండా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications