హిందూపురంలో హరికృష్ణ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు
నల్గొండ: నందమూరి హరికృష్ణ తన తండ్రి మృతి అనంతరం హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మూడుసార్లు ఎన్టీఆర్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. తండ్రి మృతి తర్వాత హరికృష్ణ భారీ మెజార్టీతో గెలిచారు.
ఇప్పటి వరకు హిందూపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే హరికృష్ణనే. 1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ రెడ్డిపై 62వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇంత మెజార్టీ హిందూపురంలో ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు.

2014లో ఇదే హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేసి గెలిచారు. ఆయన నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గ సమస్యలపై వెంటనే స్పందించేవారని గుర్తు చేసుకుంటున్నారు. హరికృష్ణ మృతి విషయం తెలిసి హిందూపురం ప్రజలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.












Click it and Unblock the Notifications