chandrababu: అఖిలప్రియ దీక్ష భగ్నం, బాబు అరెస్టు అయిన చోటే, ఏదైనా అయితే !
కర్నూలు/నంద్యాల: తెలుగుదేశం (tdp) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (chandrababu)ఇటీవల నంద్యాలలో బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం వైఎస్ జగన్ ( ys jagan)మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
నంద్యాలో బహిరంగ సభ ముగిసిన తరువాత ఆర్కే ఫంక్షన్ హాల్ ఆవరణంలో బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు నాయుడిని (chandrababu) వేకువ జామున స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు (chandrababu)బెయిల్ రాకపోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు (chandrababu) అరెస్టు అయిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దే మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ రెండు రోజుల నుంచి నిరవదిక నిరాహార ధీక్షకు దిగారు. మాజీ మంత్రి అఖిల ప్రియకు (akhilapriya) మద్దతుగా భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు.
మాజీ మంత్రి అఖిల ప్రియకు (akhilapriya) మద్దతుగా ఆమె సోదరుడు, టీడీపీ నాయకుడు విఖ్యాత్ రెడ్డి కూడా నిరాహార దీక్షకు కుర్చున్నారు. రెండు రోజుల నుంచి సవ్యంగా సాగుతున్న అఖిల ప్రియ నిరాహార దీక్షకు పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం వేకుజా మున ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు వెళ్లిన పోలీసులు మాజీ మంత్రి అఖిల ప్రియ (akhilapriya) నిరవదిక నిరాహార ధీక్షను భగ్నం చేశారు.
అఖిల ప్రియను (akhilapriya) ఆళ్లగడ్డకు తరలించిన పోలీసులు ఆమెను ఇంటిలోకి పంపించడానికి ప్రయత్నించారు. అయితే అఖిల ప్రియ ఆమె ఇంటిలోకి వెళ్లడానికి నిరాకరించారు. తాను వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని అఖిల ప్రియ (akhilapriya) మొండికి వేశారు. పోలీసులు ఎంత చెప్పినా అఖిల ప్రియ. ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి తాము ఇంటి నుంచి దీక్ష కొనసాగిస్తామని అన్నారు. అయితే పోలీసులు అఖిల ప్రియను (akhilapriya) , ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications