మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ, భరత్ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద బ్రాండ్ అంబాజిడర్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయని నమ్మకం తమ కూటమి ప్రభుత్వానికి ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు వల్లే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ చెప్పారు.
చాలా మంది పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబుని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు అడిగినవని కేంద్రం వెంటనే మంజూరు చెయ్యాలని స్వామి వారిని తాను ప్రార్ధించానని, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకుంటుందని తమకు చాలా నమ్మకం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు వస్తేనే మన రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో మరన్ని పరిశ్రమల ఏర్పాటు చెయ్యడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేశ్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి అనే విషయం తెలిసిందే.
బీజేపీ మాజీ ఎంపీ అయిన టీజీ. వెంకటేష్ పెద్ద పారిశ్రామిక వేత్త. కరోనా వచ్చిన సమయంలో కర్నూలు నగరంతో పాటు ఆ జిల్లా ప్రజలకు టీజీ వెంకటేష్ కుటుంబం అనేక రకాలుగా ఆదుకుంది. కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసిన సమయంలో కర్నూలులో పార్టీలకు, కులమాతలకు అతీతంగా టీజీ వెంకటేష్ కుటుంబం వేలాది మంది పేద ప్రజలను ఆదుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న టీజీ వెంకటేష్ ఆయన కుమారుడు టీజీ భరత్ ను ఎమ్మల్యేగా గెలిపించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు టీజీ భరత్ మంత్రి పదవి దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications