లోకేశ్ కన్నీరు, భువనేశ్వరి యాత్ర ఖరారు - పొత్తుపై కీలక వ్యాఖ్యలు..!!
నారా లోకేష్ కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రస్తావన చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. తమ ఆస్తులన్నీ బహిర్గతం చేశామని.. డబ్బే సంపాదించాలని చంద్రబాబే భావిస్తే రాజకీయాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు. చంద్రగిరి నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర వచ్చే వారం ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ పునః ప్రారంభించనున్నారు.
160 స్థానాలు ఖాయం
టీడీపీ రాష్ట్ర విస్తృస్థాయి సమావేశంలో లోకేష్ కీలక ప్రసంగం చేసారు. తప్పు చేయకున్నా.. ప్రజల కోసం పోరాడిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ లోకేష్ కంటతడి పెడ్డారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదన్నారు. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జగన్ అనుకున్నారని చెప్పుకొచ్చారు.
25 నుంచి భువనేశ్వరి యాత్ర
తన తల్లిపై ఐటీ రియర్న్స్ చూపి..తన తల్లి పైనా కేసు పెడతానని బెదిరించారని పేర్కొన్నారు. తన తల్లి ఏనాడైనా బయటకొచ్చారా అని ప్రశ్నించారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తన తల్లికి తెలియదన్నారు. గవర్నర్‌ను కలవడానికి కూడా తన తల్లి వెళ్లలేదన్నారు. టీడీపీ - జనసేన మధ్య విబేధాలు వచ్చేలా పేటీఎం బ్యాచ్ కృషి చేస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు, పవన్ విషయంలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు తమకు చెప్పారన్నారు. ఈ నెల 24న నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అదే రోజు నారావారి పల్లెలో పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 25న చంద్రగిరి నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో మరిణించిన కుటుంబాలను పరామర్శించనున్నారు.
నవంబర్ 1 నుంచి లోకేష్ పర్యటన
వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన బాబు షూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం నవంబర్ 1 నుండి ప్రారంభిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ హామీలు ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
ఎన్నికలకు ఇంకా కేవలం 5 నెలలే సమయం ఉందని... ఇంటింటికీ వెళదాం, ప్రజల్ని చైతన్యం చేద్దామని లోకేష్ సూచించారు. త్వరలో తన యువగళం కూడా ప్రారంభం అవుతుందని సమావేశంలో చెప్పుకొచ్చారు. టిడిపి-జనసేన కలిసి 175 సీట్లకి 160 సీట్లు గెలుస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. ఓటర్ల జాబితా పైన ప్రతీ నియోజకవర్గంలోనూ నేతలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ చెప్పుకొచ్చారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications