జగన్ వద్దన్నారు, అప్పుడు చేయాలి: మోడీ దీక్షపై లోకేష్, అప్పుడే అమరావతిలో సొంతిల్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీల నిరాహార దీక్షపై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం స్పందించారు. అలాగే, అమరావతిలో ఇల్లు లేని చంద్రబాబు, లోకేష్‌లు ఏపీ వారు ఎలా అవుతారని ప్రశ్నించిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కూడా సమాధానం చెప్పారు.

పార్లమెంటులో సభ జరగకుండా అడ్డుకున్నది ప్రధాని మోడీ, బీజేపీ నేతలు అని మండిపడ్డారు. సభ సజావుగా జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని తెలిపారు. సభను నిత్యం అడ్డుకున్న అన్నాడీఎంకే వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

హామీలు నెరవేర్చాక దీక్ష చేయాలి

హామీలు నెరవేర్చాక దీక్ష చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోడీ దీక్ష చేస్తే బాగుంటుందని లోకేష్ అన్నారు. అన్ని రోజులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తే ఒక్క రోజు కూడా చర్చకు రానివ్వలేదన్నారు. ఇది చర్చకు వస్తే ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం అందరికీ తెలిసేదన్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల గురించి మోడీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

జగన్ వద్దన్నారు కానీ

జగన్ వద్దన్నారు కానీ

పార్ట్‌నర్ సమ్మిట్ వంటి వాటిని వైసీపీ అధినేత జగన్ వద్దంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు. కానీ దీని వల్లే ఏపీకి కియా, హీరో వంటి సంస్థలు వచ్చాయని వెల్లడించారు. ఇలాంటి సమ్మిట్‌ల వల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.

అమరావతిలో ఇల్లు కట్టుకోవడంపై

అమరావతిలో ఇల్లు కట్టుకోవడంపై

అమరావతిలో ఇల్లు లేదన్న ముద్రగడకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకుంటే లేనిపోని ఆరోపణలు వస్తాయన్నారు. రైతులకు ల్యాండ్ ఫూలింగ్ ఫలితాలు అందిన తర్వాతే అమరావతిలో సొంతిల్లు కట్టుకోవాలని అనుకున్నామని చెప్పారు.

సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు

సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. సభకు వచ్చి ప్రజల సమస్యలను ప్రస్తావించని ఎమ్మెల్యేలు వేతనాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

మోడీ ఎందుకు దీక్ష చేస్తున్నారు?

మోడీ ఎందుకు దీక్ష చేస్తున్నారు?

అంతకుముందు, చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ ఎందుకు దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను దీక్షలతో మోసం చేయలేరన్నారు. అవిశ్వాసం చర్చకు రాకుండా చేసి దీక్షలా అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ ఒక్క సీటు గెలవదన్నారు. కాగా, గురువారం ఏపీలో బీజేపీ ఎంపీలు దీక్షలో పాల్గొననున్నారు. విశాఖలో హరిబాబు, భీమవరంలో గోకరాజు రంగరాజు, బెజవాడలో జీవీఎల్ నర్సింహా రావు పాల్గొంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister Nara Lokesh counter on PM Narendra Modi deeksha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి