బీహార్ లో లోకేష్ ఎన్నికల ప్రచారం..!!
బిహార్ ఎన్నికల ప్రచారంలో ఏపీ మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఎన్డీఏ తరుపున రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీఏకు ప్రతిష్ఠాత్మకంగా మారిన బీహార్ ఎన్నికల్లో మిత్ర పక్షాల నేతలు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఎన్డీఏలో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. టీడీపీ మఖ్య నేత లోకేష్ బీహార్ లో ప్రచారానికి దిగుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
ఏపీ మంత్రి నారా లోకేశ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న టీడీపీ ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తోంది. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు బీహార్ లో కూడా టీడీపీ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైంది.

ఆ పార్టీ తరపున ఈసారి చంద్రబాబు కాకుండా లోకేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. పారిశ్రామిక వేత్తలతో పాటుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖు లతో లోకేశ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్.. మధ్యాహ్నం బీహార్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. సాయంత్రం పాట్నా చేరుకుంటారు. అనంతరం ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారం చేపడతారు.
ఇటీవలికాలంలో కేంద్రంలో కీలక సమావేశాలకు లోకేశ్ తరచుగా హాజరవుతున్నారు. ప్రధాని మోడీ కూడా లోకేశ్ ను ఢిల్లీ పిలిపించుకుని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో.. సాయంత్రం 7.30 కి బీహార్ పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు.
నవంబర్ 9, ఆదివారం ఉదయం 10 గంటలకు పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా NDA అజెండాను ముందుకు తీసుకెళ్లగల నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి లోకేశ్ కు అవకాశం లభించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications