లడ్డూ వివాదం, దేవుడి శిక్ష నుంచి జగన్ తప్పించుకోలేడు, నారా లోకేష్

వైసీపీ అధినేత జగన్ 2019లో ప్రజలకు మాయమాటలు చెప్పడంతో ప్రజలు ఆ మాటలు నమ్మి వైసీపీని అధికారంలోకి తెచ్చారని, ఆ తర్వాత అధికారం అండగా ఉందని అహంకారంతో జగన్ ఏమాత్రం భయం లేకుండా కమిషన్లకు కక్కుర్తిపడి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు తీరిన శ్రీవారి సన్నిధిలో కల్తీ పనులు చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.

జగన్ పాపం పండిందని, త్వరలోనే దేవుడు ఆయన లెక్కలు తేలుస్లారని మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి విషయంలో తిరుమలలో చెయ్యరాని పనులన్నీ చేశారని, అందుకు ఫలితంగా ప్రజా కోర్టులో జగన్ కు, వైసీపీ నాయకులకు సరైన శిక్ష పడిందని, ప్రజల ఇచ్చిన తీర్పుతో అధికారానికి దూరం అయ్యారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Nara Lokesh said that Jagan should be ready for the punishment imposed by Tirumala Srivenkateswara Swami

దేవుడి కోర్టులో, న్యాయస్థానంలో పడే శిక్షలకు వైసీపీ అధినేత జగన్ సిద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అధికారం అడ్డం పెట్టుకున్న వైసీపీ నాయకులు తిరుమలలో చేయరాని పనులు చేశారని, చివరికి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డూల విషయంలో అడ్డంగా దొరికిపోయిన జగన్, వైసీపీ బ్యాచ్ ఇప్పుడు ఫేక్ ముఠాను రంగంలోకి దింపి కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయిస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

అంతే కాకుండా సోషల్ మీడియాలో చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. జంతువుల కొవ్వు కలిపిన నాలుగు లారీల ఏఆర్ డైరీ నెయ్యిని టీటీడీ అధికారులకు తిరిగి పంపించారని, ఆ నెయ్యి కల్తీ అయ్యిందని ల్యాబ్ నివేదిక ఇచ్చిందని, ఆ విషయం వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆ పార్టీ నాయకులను నిలదీశారు.

Nara Lokesh said that Jagan should be ready for the punishment imposed by Tirumala Srivenkateswara Swami

తిరుమల లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అయ్యిందని ల్యాబ్ నివేదికలో వెలుగు చూసిందని, ఇంత జరిగినా జగన్, వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపైనే ఎదురు దాడి చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి నారా లోకేష్ చెప్పారు. తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి ఉపయోగించి పాపాలు చేసిన వైసీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయిందని, ఆ దేవుడు త్వరలోనే వాళ్లందరికీ కఠిన శిక్ష విధిస్తాడని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+