'సెక్షన్ 8, ఓటుకు నోటు వేరు': కేసీఆర్ తీవ్ర నిర్ణయం తీసుకుంటారా?
హైదరాబాద్: సెక్షన్ 8 వేరు, ఓటుకు నోటు వేరని, కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ తనకు ఉన్న అధికారాలు పూర్తిగా వినియోగించుకుంటూ విధులను నిర్వర్తించుకోవచ్చని చెప్పారు.
విభజన చట్టంలోని సెక్షన్ 8ను ప్రత్యేకంగా అమలు చేసేందుకు ఎటువంటి ఆధేశాలు అవసరం లేదని, కావాలనుకుంటే ఎప్పుడైనా గవర్నర్‌కు సూచించారని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు విషయాన్ని కోర్టు చూసుకుంటుందని చెప్పారని తెలుస్తోంది.

కాగా, శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన విషయం తెలిసిందే. మీరు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారని మీడియా పైన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సెక్షన్ 8 అమలు చేస్తే కేసీఆర్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారని కేంద్రంకు గవర్నర్ చెప్పారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, హైదరాబాదులో సెక్షన్ 8 కచ్చితంగా అమలు జరగాల్సిందేనని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. తెలంగాణ గిల్లికజ్జాలకు దిగుతోందని, అవసరమైతే బస్సులో నుండి అయినా పరిపాలన చేస్తానని చెప్పారు. మన పైన వారి పెత్తనమేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications