ఎపి, టీ వివాదం: ఫోన్ ట్యాపింగ్‌పై నరసింహన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన టెలిఫోన్ ట్యాపింగ్‌పై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్‌లో కొనసాగుతున్న సంభాషణను ఎక్కడో వేల మైళ్ల దూరంలోని వ్యక్తులు వింటున్నారని ఆయన అన్నారు.
సికింద్రాబాదులో ఉన్న సైనిక ఇంజినీరింగ్ కాలేజ్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ విభాగానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి విపరిణామాలు జరుగకుండా ఉండాలంటే ట్యాపింగ్ లేని సెల్ ఫోన్ వ్యవస్థ రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని కూడా నరసింహన్ అభిప్రాయపడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాల నేతలను, ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్న ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. కేసుకు సంబంధించిన 14 ఆడియో, వీడియో టేపులను ఇప్పటికే నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో ఈ టేపులను ఇతర రాష్ట్రాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు కూడా పంపించామని తెలంగాణ ఏసీబీ అధికారులు తెలిపారు. టేపులకు సంబంధించి నిజ నిర్ధారణ చేసుకునేందుకు వారి నుంచి నివేదిక కోరామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications