2న కెసిఆర్, నేను ప్రమాణం: నరసింహన్, మోడీకి చెప్పా

Narasimhan will be the Governor of Telangana and AP.
హైదరాబాద్: జూన్ 2వ తేదీన తెలంగాణలో, జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని గవర్నర్ నరసింహన్ శనివారం చెప్పారు. రాజ్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై తాను ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వివరించారని, ఆయన సావధానంగా విన్నారని చెప్పారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. తాను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా జూన్ 2న ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. తాను ఉదయం ఆరున్నర గంటలకు గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని, తెరాస అధ్యక్షులు కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా గం.8.25కు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

రెండు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లు సమానంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. వినియోగం ఆధారంగా ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపు జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జలవనరులు ఉన్నందున అక్కడ వినియోగం తక్కువగా ఉంటుందని, తెలంగాణలో వినియోగం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

నాలుగున్నరేళ్ల పాటు బుల్లెట్ లేకుండా శాంతిభద్రతలను కాపాడినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తన పైన చేసిన విమర్శలపై గవర్నర్ స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. ఇరు రాష్ట్రాలు పురోగతిని సాధించాలన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించానని, చివరి రెండేళ్లు రాష్ట్రాన్ని కష్టాలు చుట్టుముట్టాయన్నారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+