సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కెసిఆర్ కృషి: నారాయణమూర్తి
నల్గొండ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సినీ ఇండస్ట్రీకి 3వేల ఎకరాలు కేటాయిస్తామనడం హర్షణీయమని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని అంజిరెడ్డి థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి రాజ్యాధికారం సినిమాను కొద్దిసేపు వీక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు అన్న పెద్దల మాట సినిమా తీసిచూడు.. ప్రమోట్ చేసి చూడు అన్నదానికి సరిగ్గా సరిపోతుందన్నారు.
ఇండస్ట్రీలో మానవీయ విలువలపై ఆర్థిక విలువలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయన్నారు. సగటు బడ్జెట్ సినిమాలు మార్కెట్‌ను తట్టుకొని నిలబడడం కష్టంగా మారిందని వాపోయారు.

డబ్బు ప్రస్తుత రాజకీయాలను శాసిస్తున్నదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ చేపట్టడం అభినందనీయమని, కానీ పేదలు ఆత్మగౌరవం సాధించినప్పుడే దేశం నిజమైన స్వచ్ఛభారత్‌గా మారుతుందన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
హైదరాబాద్: ప్రభుత్వ న్యాయవాదుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 60 శాతం రిజర్వేషన్ కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ సోమవారం హైకోర్టు న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జేఏసీ నేత గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్, విజారత్, నరేందర్, రవి, ఆకుల శ్రీను, పులిగారి గోవర్ధన్‌రెడ్డి, ఆర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications