పిక్చర్స్: ప్రకృతి వైద్యం, నేచర్ క్యూర్ ఇలా..
హైదరాబాద్: వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రకృతి మానవ శరీరానికి తగిన శక్తిని సమకూర్చింది. వ్యాధులను నయం చేయడానికి నేచురోపతి శాస్త్రీయ పద్ధతి అని చెబుతుంటారు. కానీ ఈ విషయంలో కొన్ని వాదోపవాదాలు ఉన్ాయి. ప్రకృతి వైద్యంలో భోజన పద్దతులను మార్చుకోవడం, ఉపవాస దీక్షలు, ప్రకృతి వనరులతో చికిత్స ఇమిడి ఉంటాయి. దీనిపై ఇప్పుడిప్పుడే చైతన్యం పెరుగుతోంది.
ప్రకృతి వైద్యంలో పేరెన్నిక గన్న కస్తూర్బా నేచర్ క్యూర్ ఆస్పత్రిని సర్వోదయ చారిటబుల్ ట్రస్టు 1964లో ప్రారంభించింది. ఇది హైదరాబాద్, బెంగళూర్ జాతీయ రహదారిపై నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు రెండు కిలోమీటర్ల దూరంలోని శివరాంపల్లిలో ఉంది.
ఆస్పత్రి 8 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. పచ్చటి ప్రకృతి సంపద మధ్య అది నడుస్తోంది. శరీరానికి, మనసుకు ప్రశాంతతను చేకూర్చే రీతిలో వాతావరణం ఉంటుంది. ఇది 40 పడకల ఆస్పత్రి. ఉదర సంబంధ వ్యాధులకు, శ్వాస కోశ సంబంధ వ్యాధులకు, నాడీ సంబంధం సమస్యలకు, కార్డియోవాస్క్యులర్ సమస్యలకు తాము చికిత్సను అందిస్తామని ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ డివై చారి అన్నారు.

కస్తూర్బా నేచర్ క్యూర్ ఆస్పత్రి ద్వారం
హైదరాబాదులోని శివరాంపల్లిలో గల కస్తూర్బా నేచర్ క్యూర్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం ఇలా ఉంటుంది. దీని నుంచి లోనికి ప్రవేశిస్తే అంతా పచ్చదనమే..

లోనంతా పచ్చటి వాతావరణం
కస్తూర్బా నేచర్ క్యూర్ ఆస్పత్రి ఆవరణలోకి అడుగు పెడితే అంతా పచ్చదనమే... పచ్చటి వాతావరణం మనసుకు, దేహానికి ప్రశాంతతను చేకూరుస్తుంది.

చికిత్స అందించేందుకు సిద్ధం
ప్రవేశ ద్వారం తాము ఏయే వ్యాధులకు చికిత్స చేస్తామనే డిస్‌ప్లే బోర్డు ఒక్కటి ఉంటుంది. దాన్ని చదువుకుని రోగులు ముందుకు సాగవచ్చు.

పెరాలిసిస్ చికిత్స కోసం వచ్చిన దంపతులు
పెరాలిసిస్ వ్యాధికి, కీళ్ల నొప్పులకు చికిత్స చేయించుడుకోవానికి ఈ దంపతులు ఆస్పత్రికి వచ్చారు.

ఆస్పత్రి సూపరింటిండెంట్
కస్తూర్బా నేచర్ క్యూర్ ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ డివై చారి.. తాము వ్యాధులకు చికిత్స అందించే విషయాన్ని వెల్లడించారు.

మడ్ బాత్..
ప్రకృతి వైద్యంలో మడ్ బాత్ ముఖ్యమైంది. శరీరానికి బురద మన్ను రాసి చికిత్స చేస్తారు.

మడ్ బాత్‌తో ఓ వ్యక్తి ఇలా..
మడ్ బాత్‌తో ఓ వ్యక్తి ఇలా కనిపించాడు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్ముతారు.

ఉద్రిక్తతల నియంత్రణ..
మడ్ బాత్‌తో మనిషిలోని భావోద్వేగాలు, ఉద్రిక్తతలు నియంత్రణకు గురవుతాయని అంటారు. శరీరం చల్లబడి సాధారణ స్థితికి వస్తుందని దానివల్ల టెన్షన్ తగ్గుతుందని భావిస్తారు.

రక్తంపోటు తగ్గుతుంది..
మడ్ బాత్ వల్ల రక్తం పోటు తగ్గుతుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. దానికి ఇలా మడ్ బాత్ చికిత్స చేస్తుంటారు.

చర్మసంబంధ వ్యాధులు
మడ్ బాత్ చర్మ సంబంధ వ్యాధులను కూడా నయం చేస్తుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. దానికి చికిత్స చేయించుకోవడానికి ఇక్కడికి రోగులు వస్తుంటారు.

ప్రకృతిలో చేరిపోతాడు..
మడ్ బాత్‌లో మనిషి మునిగిపోయి.. ప్రకృతిలో కలిసిపోయినట్లుగా కనిపిస్తాడు. ఇలా శరీరమంతా బురద పూస్తారు.

మట్టి విగ్రహంలా..
మనిషికి బురద పూసి, దాని ద్వారా చర్మ సంబంధ వ్యాధులను నయం చేయవచ్చునని ప్రకృతి వైద్యం చెబుతోంది.

వేప పేస్ట్ స్నానం..
వేప పేస్ట్ స్నానం చర్మవ్యాధులను నయం చేస్తుంది. వేపలో పలు ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం తెలిసిందే.

కళ్లపై మడ్ ప్యాక్
కళ్లపై మడ్ ప్యాక్ చికిత్స వల్ల రిలాక్స్ అవుతారని, కంటిచూపు మెరుగవుతుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

బాడీ మసాజ్
శరీర మర్దన నరాల పట్లను తొలగించి, కదలికలను పెంచుతుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

శరీరం ఉత్తేజం..
బాడీ మసాజ్ ప్రాధాన్యం ఆధునిక కాలంలో అందరికీ తెలిసి వచ్చింది. దీని వల్ల శరీరం ఉత్తేజంగా మారుతుంది.

స్టీమ్ బాత్
స్టీమ్ బాత్ ఉదర సంబంధమైన సమస్యలను పరిష్కరిస్తుంది. లావును తగ్గిస్తుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

ఆకుల స్నానం..
లీఫ్ బాత్ (ఆకుల స్నానం) చర్మ సంబంధమైన వ్యాధులను నయం చేయడానికి, లావును తగ్గించడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి వాడుతారు.

అరటి ఆకులు..
లీఫ్ బాత్‌లో అరటి ఆకులతో శరీరాన్ని కప్పుతారు. ఆ తర్వాత బ్లాంకెట్ కప్పుతారు.

ఏమవుతుంది..
లీఫ్ బాత్ వల్ల శరీరం లోపల వేడి పుట్టి, చర్మగ్రంథులు క్రియాశీలం అవుతాయని, చర్మం ఉత్తేజంగా మారి చురుగ్గా పనిచేస్తుదని అంటున్నారు.

నిమజ్జన స్నానం..
నిమజ్జన స్నానం (ఇమ్మర్షన్ బాత్) వల్ల శరీరం చల్లబడుతుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

శిరోధార సర్వరోగ నివారణి..
శీరధార చికిత్సతో పలు వ్యాధులను నయం చేయవచ్చునని అంటున్నారు. కంటి జబ్బులు, నరాల బలహీనత, మరుపు, చెవుడు వంటి పలు అవలక్షణాలు తగ్గుతాయని ప్రకృతి వైద్యం చెబుతోంది.

జట్టుకు కూడా..
శిరోధార చికిత్స జట్టు నెరిసిపోవడాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. సోయాసిస్ వంటి చర్మ సంబంధ వ్యాధులను కూడా దీంతో నయం చేయవచ్చునని చెబుతున్నారు.

కాలి స్నానం (ఫుట్ బాత్)
ఫుట్ బాత్ వల్ల రక్తనాళాలు చురుగ్గా పనచేస్తాయి. దానివల్ల కాళ్లలో రక్తప్రసరణ పెరిగి శరీరం చల్లబడుతుంది.

ఆస్పత్రిలో అంబియెన్స్
కస్తూర్బా ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఇలా అంబియన్స్ ఉంది. యోగా చేసుకోవచ్చు..

భోజనశాల..
అస్పత్రిలో భోజన శాల ఇలా ఉంది. భోజనం తీసుకోవడంలో తగిన నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది.

కాటేజీలు..
కస్బూర్బా ప్రకృతి చికిత్సాలయంలో కాటేజీలు కూడా ఉన్నాయి. అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

బెల్లు ఇలా...
షోయింగ్ టైమ్స్‌ను వెల్లడించడానికి బెల్లు మోగిస్తారు. ఆ బిల్లు ఇలా వేలాడుతూ కనిపిస్తుంది.

భోజన నియమాలు..
కస్తూర్బా ప్రకృతి చికిత్సాలయంలో భోజన నియమాలు కఠినంగానే ఉంటాయి. వాటినే ఆరగించాల్సి ఉంటుంది.

భోజన పదార్థాలు ఇలా..
పండ్ల రసాలు, ఉడకించని కూరగాయలు, విత్తనాలు మధ్యాహ్న భోజనంలో అందిస్తారు. బయట చాలా మంది కూరగాయలను వండకుండా తింటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications