నీతు అగర్వాల్‌కు షాక్, ఫోన్ల వివరాలు తెల్సుకోవాలి
కర్నూలు: ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతు అగర్వాల్ బెయిల్ పిటిషన్‌ను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ న్యాయస్థానం కొట్టువేసింది. శనివారం బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి.
ఈ కేసులో విచారణ పూర్తయిందని, నీతు అగర్వాల్‌కు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తిగా ముగియలేదని, మరో నలుగురిని అరెస్టు చేయవలసి ఉందని రుద్రవరం పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు.

నిందితురాలి ఫోన్ నుండి వచ్చిన, వెళ్లిన ఫోన్ల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే విచారణ పైన ప్రభావం పడుతుందని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు నీతు అగర్వాల్‌కు బెయిల్ నిరాకరించింది.












Click it and Unblock the Notifications