ఉదయం 6 గంటలకు జైలు నుంచి విడుదలైన హీరోయిన్ నీతూ అగర్వాల్‌

హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రయేయముందన్న కారణంగా అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్‌ను ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కర్నాలు ఆళ్లగడ్డ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

షరతులతో కూడిన బెయిల్‌ను మంగళవారం మంజూరు చేసింది. దీంతో కోర్టు పేపర్లు అందుకున్న నంద్యాల సబ్ జైలు అధికారులు బుధవారం ఉదయం 6 గంటలకు ఆమెను విడుదల చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్న నీతూ అగర్వాల్ ఎర్ర చందనం స్మగ్లర్లకు తన బ్యాంకు ఖాతా ద్వారా డబ్బు పంపిన సంగతి తెలిసిందే.

Neetu Agarwal released from jail

ఆమె కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించిందనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఆమె పోలీసు విచారణలో ఏం చెప్పిందనే విషయాలు తెలియడం లేదు.

13వ తేదీ నుండి నీతు కోసం పోలీసులు గాలిస్తూ చివరికి అదుపులోకి తీసుకోగలగారు. నీతూకి ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని, తనతో సన్నిహితంగా ఉంటున్న కారణంగానే ఆమెపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మస్తాన్ వలీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+