మూసుకొని కూర్చో.. మధ్యలో కెలకొద్దు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. పోయినేడాది మహేష్ బాబు పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి సినిమాలను మళ్లీ విడుదల చేశారు. రీ రిలీజ్ లో కూడా అవి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో బిజినెస్ మెన్ ను మళ్లీ విడుదల చేశారు. తాజాగా పవన్ నటించిన మరికొన్ని సినిమాల రీరిలీజ్ పై చర్చ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు సినిమాలు రీ రిలీజ్ చేసి వాటి ద్వారా వచ్చిన ఫండ్‌ను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు. ఈ సారి గుడుంబా శంకర్ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం వాటి పనులు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించారు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వేసిన ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

netizens comments on bandla ganesh tweet

పవన్ కళ్యాణ్ జన్మదినానికి గబ్బర్ సింగ్ ను మళ్లీ విడుదల చేసి తమ స్టామినా ఏంటో చూపిస్తామని బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. గుడుంబా శంకర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. మధ్యలో వేలు పెట్టకండి లేదంటే మాట్లాడుకొని గబ్బర్ సింగ్ ప్లాన్ చేయండి అని ఓ అభిమాని కామెంట్ పెట్టారు.

మూసుకుని ఉండు అన్నా.. గుడుంబా శంకర్ విడుదలకు సిద్ధంగా ఉంది.. దాని వల్ల వచ్చే డబ్బు మన పార్టీకి వాడతారు.. కావాలంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం వేసుకో అన్న అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్‌కు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. ఏం వార్త చెప్పావ్ అన్నా.. సరే మళ్లీ విడుదల చేద్దామంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చాడు. వద్దన్నా.. ఇప్పటికే గుడుంబా శంకర్ వస్తోందిన.. గబ్బర్ సింగ్ ను వచ్చే సంవత్సరం పుట్టినరోజునాడు విడుదల చేసేలా ప్లాన్ చేయండి అంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+