AP Assembly: రేపు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణం ! వరుసలో జగన్ ఎక్కడంటే ?
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారు రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపు ఆర్డర్ లో ఎవరెప్పుడు ప్రమాణం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది.
రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ సభను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణస్వీకారాలు చేయించాల్సి ఉంది. ఇందులో ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మంత్రుల తర్వాత మహిళా ఎంఎల్ఏ లు,ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.

అయితే తాజా ఎన్నికల ఫలితాలతో విపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ పరిస్దితి ఏంటనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ రేపు అసెంబ్లీకి వస్తారని అనుకుంటే..ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయన కూడా సాధారణ ఎంఎల్ఏ లతో పాటే ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. అంటే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర అధికార కూటమి ఎమ్మెల్యేల ప్రమాణం అంతా పూర్తయిన తర్వాత చివర్లో వైసీపీ సభ్యులతో పాటు జగన్ ప్రమాణస్వీకారం చేస్తారన్న మాట.












Click it and Unblock the Notifications