కృష్ణానదిపై రెండు వంతెనలు, ఆరు వరుసలు -ఓఆర్‌ఆర్‌ లో కీలక మార్పులు..!!

రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్మాణాలకు ప్రణాళికలు ఖరారు అవుతున్నాయి. రాజధాని చుట్టూ 19 కిలో మీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ సిద్ధం చేసి ఢిల్లీకి పంపింది. ఇదే సమయంలో కృష్ణానదిపై ఆరు వరుసలతో రెండు వంతెనల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. వీటి నిర్మాణం పరిధిని ఇప్పటికే ఖరారు చేసారు. ఈ రెండు ప్రాజెక్టులు అమరావతికి కీలకంగా మారనున్నాయి.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయాన్ని రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పొడవు 158 కిలోమీటర్లు కాగా, అమరావతి ఓఆర్‌ఆర్‌ 190 కిలోమీటర్లతో దానికంటే పెద్దది కానుంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. ప్రతి ప్యాకేజీని వేర్వేరు దశల్లో టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఈ రింగ్‌రోడ్‌ మొత్తం ఆరు వరుసల ప్రధాన మార్గంతో, రెండు వైపులా సర్వీస్‌ రోడ్లు కలిపి నిర్మించనున్నారు. మొత్తం 190 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ జరుగుతోంది. ఈ భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు భరిస్తుందని హామీ ఇచ్చింది.

nhai-submits-latest-dpr-over-new-bridges-on-kirshna-river-as-capital-project

ఇక, ప్రాజెక్ట్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు ఆరు వరుసల వంతెనలు నిర్మించనున్నారు. మొదటి వంతెన మున్నలూరు వద్ద 3.15 కిలోమీటర్ల మేర, రెండవ వంతెన మున్నంగి వద్ద 4.8 కిలో మీటర్ల మేర ఉంటుంది. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే గుంటూరు, విజయవాడ, తెనాలి ప్రాంతాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది. అమరావతి ప్రాంతాన్ని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించడానికి రెండు స్పర్‌ రోడ్లు నిర్మించనున్నారు. అందులో ఒకటి తెనాలికి సమీపంలోనుంచి ప్రారంభమై కాజా టోల్‌ ప్లాజా వద్ద విజయవాడ బైపాస్‌ వరకు కొనసాగుతుంది. రెండోది తెనాలికి సమీపంలోనుంచి ప్రారంభమై కాజా టోల్‌ ప్లాజా వద్ద విజయవాడ బైపాస్‌ వరకు కొనసాగుతుంది. మొత్తం పొడవు 17.5 కిలోమీటర్లు. ఇది ఆరు వరుసలతో నిర్మించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+