జగన్ సర్కార్‌పై నిమ్మగడ్డ ఎదురుదాడి? ఆ విషయంలో హైకోర్టులో పిటీషన్? అడ్వొకేట్ జనరల్‌పై

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి హైకోర్టు గడప తొక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆయన కోర్టు ధిక్కార పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించబోతున్నారని అంటున్నారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడంలో ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందనే కారణంతో కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేశారు.

Recommended Video

    Nimmagadda Ramesh Kumar Case Coming To Hearing On June 10 In Supreme Court

     హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం..

    హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం..

    రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలని ఆదేశిస్తూ ఇదివరకే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలను ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని, గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టేయడం సహేతుకమైనదేనని స్పష్టం చేసింది.

    సర్కులర్ రద్దుపైనే..

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గవర్నర్ ద్వారా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేయడంలో తప్పు లేదని పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రకారం.. తనను మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంలో ప్రభుత్వం ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. దీనితోపాటు- ఇదివరకు తనను తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుంటూ జారీ చేసిన సర్కులర్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారని అంటున్నారు.

     సుబ్రహ్మణ్య శ్రీరామ్ ప్రకటనపై

    సుబ్రహ్మణ్య శ్రీరామ్ ప్రకటనపై

    సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉన్నందున తాము ఇప్పటికిప్పుడు రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించలేమని, అదే సమయంలో.. తనను తాను ఎన్నికల కమిషనర్‌గా నియమించుకోవడాన్ని కూడా తప్పు పడుతున్నట్లు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ఇదివరకే స్పష్టం చేశారు. సుబ్రహ్యణ్య శ్రీరామ్ చేసిన ప్రకటన.. హైకోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

    బాధ్యతలను తీసుకోనివ్వకుండా..

    బాధ్యతలను తీసుకోనివ్వకుండా..

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేనప్పటికీ.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదని, ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందని రమేష్ కుమార్ బలంగా నమ్ముతున్నారని అంటున్నారు. ఈ విషయంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటీషన్ వేసే అవకాశాలు ఉన్నాయని జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చవచ్చని వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+