అమరావతి, విజయవాడకు కేంద్రం గుడ్ న్యూస్..!!

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతితో పాటుగా రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల పైన చర్చించారు. చంద్రబాబు అభ్యర్దన పైన కేంద్రం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా తొలిగా అమరావతి, విజయవాడ పైన తాజా ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

కేంద్రం అనుమతి
విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. అందులో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యినట్లు ఎంపీ తెలిపారు. చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు సహా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి పచ్చజెండా ఊపినట్లు ఎంపీ చెప్పారు. వీటన్నింటిపై త్వరలోనే ఆదేశాలు రానున్నట్లు కేశినేని శివనాథ్ చెప్పుకొచ్చారు.

Nitin Gadkari approves state govt Request over Vijayawada Eastern By pass Road

వరుస సమావేశాలు
ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఇక మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం భేటీ అవుతారు. ఏపీలో హైవేల విస్తరణ, ఇతర అంశాలపై గడ్కరీతో చర్చించారు. అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్‌-అమరావతి హైవేపై చర్చలు జరిపారు. వాణిజ్య పన్నులశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ సుధీర్ఘ చర్చలు జరిపారు.

బడ్జెట్ కేటాయింపులు
ప్రధానితో అరగంటకు పైగా సమావేశమైన ముఖ్యమంత్రి...కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విభజన సమస్యల పైన తెలంగాణ ముఖ్యమంత్రితో నిర్వహించే చర్చల గురించి వివరించారు. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా సమాచారం. బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక రేపు నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+