నిజాం షుగర్ జిఎం ఆత్మహత్య: మరో ఘటనలో పిసి
హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లోని నిజాం షుగర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎంజిఆర్ శర్మ(59) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మలక్ పేటలో నివాసం ఉంటున్న శర్మ సోమవారం రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు బషీర్‌బాగ్‌లోని నిజాంషుగర్స్ కార్యాలయంలో శర్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఉరివేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ కృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్వార్టర్స్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో ఘటనలో ఉస్మానియా నర్సింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉస్మానియా నర్సింగ్ కాలేజీలో జనరల్ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని.. కళాశాల వసతి గృహంలోనే ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం ఒకేసారి పది నిద్రమాత్రలు మింగడంతో.. గమనించిన సహచర విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications