పోలవరం ఆగదు: జవదేకర్, వ్యతిరేకించలేదు: గుత్తా
న్యూఢిల్లీ/ నల్లగొండ: పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణం కృష్ణా, గోదావరి నదులను కలిపినట్టు అవుతుందన్నారు. ఎక్కువ నీళ్లు వృధా కాకుండా లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చని వివరించారు. త్వరలో తెలంగాణకు కూడా కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఉంటుందని ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, డిజైన్ మార్చాలని మాత్రమే కోరామని కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. పోలవరంపై తొందరపడి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావొద్దని వినతి చేశారు. ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా వచ్చిన ఆంధ్రా ఉద్యోగులను తిప్పి పంపాల్సిందేనని గుత్తా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబును గౌరవిస్తాం గానీ తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబు కక్షపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు. మోడీ కేబినెట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధకర మని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ ఆర్డినెన్స్ తేవాలని మోడీ ప్రభుత్వం అనుకుంటోందనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications