నటి రోజా బరిలో నిల్చిన నగరిలో ఎవరికీ దక్కని మెజార్టీ

విజయనగరం జిల్లాలో టిడిపి పునర్వైభవం సాధించిందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రజలు టిడిపికి ఏకపక్ష విజయాన్ని అందించారన్నారు. సీమాంధ్రకు వనరులు, నిధులు సమకూరేలా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
లాటరీ ద్వారా విజయం
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను అదృష్టం వరించింది. అనంతపురం జిల్లా హిందూపురంలో 6, 38వ వార్డుల్లో వైయస్సార్, టిడిపి అభ్యర్థులు సమానమైన ఓట్లు సాధించారు. దీంతో వారిలో విజేతను నిర్ణయించేందుకు లాటరీ వేశారు. లాటరీలో జగన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
గూడూరులో ఎవరికి రాని మెజార్టీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమానంగా గెలుపొందాయి. దీంతో గూడూరులో ఏ పార్టీ మెజార్టీ సాధించలేదు. మొత్తం 33 వార్డుల్లో 16 టిడిపి, 16 జగన్ పార్టీ, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.












Click it and Unblock the Notifications