2 ఏళ్లలోనే రూ.లక్షకు రూ.12 లక్షలు ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్
షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా ఐపీఓల (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ఎదురుచూస్తుంటారు. కొన్ని లిస్ట్ అవడంతోనే లాభాల బాటలో నడుస్తాయి. దానిని కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత కూడా పెరుగుతూనే ఉంటాయి. అలాంటి అద్భుతమైన పనితీరు కనపరిచిన స్టాక్ గురించి తెలుసుకుందాం.నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (NPST).
2021 జులైలో ఐపీఓ ప్రారంభమైంది. రూ.76-80 ప్రైస్ బ్యాండ్‌తో వచ్చింది. 2021 ఆగస్టు 10న రూ. 83.95 వద్ద లిస్ట్ అయింది. షేర్లు అలాట్ అయిన పెట్టుబడిదారులకు 5 శాతం పెరిగి వెంటనే లాభాలొచ్చాయి. ఈ SME స్టాక్ గత రెండు సంవత్సరాల్లో భారీగా డబ్బులు పెట్టినోళ్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. రూ.83.95 నుంచి రూ. 805కు పెరిగింది.

ఇది రెండు సంవత్సరాల కాలంలోనే 900 శాతం పెరిగింది. పెట్టుబడిదారులకు ఊహించని రీతిలో రిటర్న్స్ ఇచ్చింది. ఐపీవో సమయంలో డబ్బులు పెట్టినవారు ఇప్పుడు లక్షాధికారులయ్యారు. NPST ఐపీవో లాట్లలో వచ్చింది. ఒక్కో లాట్‌లో 1600 షేర్లు ఉంటాయి. ప్రైస్ బ్యాండ్ రూ.80గా నిర్ణయించిన నేపథ్యంలో రూ. 80 X 1600 (షేర్లు) = రూ. 1,28,000. ఒక్క లాట్ కొనుగోలు చేసిన వారు రూ.1,28,000 పెట్టుబడిగా పెట్టారు.

దానిని రెండు సంవత్సరాలు అలాగే ఉంచినవారికి 900 శాతం రిటర్న్స్ వచ్చాయి. అంటే రెండేళ్లలో రూ.12.88 లక్షలు చేతికి వచ్చాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అప్పుడే లాభాలు వస్తాయి. అంతేకాకుండా మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎవరికో లాభాలు వచ్చాయికదా అని తొందరపడి డబ్బులు పోగొట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications