ఏపీలో పాఠశాలలకు సెలవు పొడిగింపు - ఎక్కడెక్కడ..!!
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేసాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో క్లౌడ్ బరెస్ట్ అయింది. రికార్డు వర్షపాతం నమోదైంది. విజయవాడలో 30 ఏళ్ల కాలంలో తొలి సారి భారీగా వర్షపాతం రికార్డు అయింది. బుడమేరు పొంగటంతో పరిసర ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో వరద కొనసాగుతుండటం..మరో రోజు భారీ వర్షాలపై హెచ్చరికలు ఉండటంతో పాఠశాలలక సెలవు ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లాలో
ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దీంతో, సోమవారం కూడా అన్ని పాఠశాలలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. జిల్లాలో ప్రయివేటు, ఏయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూసివేయాలని స్పష్టం చేసారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. పలు గ్రామాల్లో వాగులు పొంగటం..రహదారుల పైన వరద నీరు ఉండటంతో విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని సూచించారు.

వరద ప్రభావం
ఎన్టీఆర్ జిల్లాను భారీ వర్షాలు..వరదలు కుదిపేస్తున్నాయి.జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. కలెక్టర్ డా.సృజన వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
అప్రమత్తం
వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెనెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే ముంపు గ్రామాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్లు ప్రాంతాలకు చెందిన వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితికి అనుగుణంగా పాఠశాలల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications