వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ఒమిక్రాన్ భయం: విదేశాల నుండి 10రోజుల్లోనే వేలాది మంది; వారిని గుర్తించటంలో కొత్త పరేషాన్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తుంది. కరోనా మహమ్మారి మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు విజృంభిస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరి నెల వస్తుంది అంటే అంతా భయపడుతున్నారు. కొద్ది కొద్దిగా కేసుల పెరుగుదల ప్రారంభమై మార్చి, ఏప్రిల్ నాటికి కరోనా పీక్స్ కు చేరుతుందేమో అన్న భయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కనిపిస్తుంది.

omicron virus : అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలకు రెక్కలు-చాలా మార్గాల్లో రెట్టింపు వసూళ్లుomicron virus : అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలకు రెక్కలు-చాలా మార్గాల్లో రెట్టింపు వసూళ్లు

గత పదిరోజుల్లో విదేశాల నుండి ఏపీకి 12,500 మంది

గత పదిరోజుల్లో విదేశాల నుండి ఏపీకి 12,500 మంది

ఇక ప్రభుత్వం గత అనుభవాల దృష్ట్యా కరోనా మహమ్మారి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎయిర్ పోర్టులలో ఏపీకి విదేశాల నుండి వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా, అధికారులు రంగంలోకి దిగే లోపే గత పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నెండు వేల ఐదు వందల మంది రావడం ఒమిక్రాన్ భయాన్ని మరింత పెంచుతుంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు తొలిసారిగా నమోదైన దక్షిణాఫ్రికాలో నాల్గవ వేవ్ విజృంభిస్తుంది. ఇక ఇతర చాలా దేశాలు సైతం ఒమిక్రాన్ వేరియంట్ భయానికి అంతర్జాతీయ విమానాల పై నిషేధం విధిస్తున్నారు.

విదేశాల నుండి వచ్చిన ఎక్కువ మంది వైజాగ్ వారే

విదేశాల నుండి వచ్చిన ఎక్కువ మంది వైజాగ్ వారే

ఇక తాజాగా డిసెంబర్ 1 తరువాత కేవలం పది రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12,500 మంది రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక విదేశాలనుండి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వారిలో ఎక్కువమంది వైజాగ్ నుండి ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మేరకు అత్యధికంగా విశాఖ జిల్లా వారే ఉన్నారని అధికారులు నివేదికలు అందించారు. విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులు అడ్రస్ లను, సేకరించి వారికి పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

చాలా మంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ .. ఇద్దరికీ కరోనా నిర్ధారణ, కొనసాగుతున్న జీనోమ్ సీక్వెన్సింగ్

చాలా మంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ .. ఇద్దరికీ కరోనా నిర్ధారణ, కొనసాగుతున్న జీనోమ్ సీక్వెన్సింగ్

ఇప్పటి వరకూ 9 వేల మంది అడ్రస్ లను అధికారులు సేకరించారు. మిగతా వారి కోసం సంప్రదించగా వారి నుండి ఎలాంటి స్పందన రావడం లేదని తెలుస్తుంది. వారి ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండటంతో వారిని ట్రేస్ చేయడం అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. అటు 9 వేల మంది లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా, వారి రక్తనమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఏపీకి వచ్చిన 12500 మంది విదేశీయులు విశాఖ జిల్లాకు చెందిన వారే 1700 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Recommended Video

Omicron Variant : NO Lockdown - Need To Follow Protective Measures | Guidelines || Oneindia Telugu
 ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువ.. వ్యాప్తి ఎక్కువ.. అందుకే ఆందోళన

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువ.. వ్యాప్తి ఎక్కువ.. అందుకే ఆందోళన

ఇక విదేశాల నుండి వచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాప్తి ఎక్కువగా ఉండే ఒమిక్రాన్ వేరియంట్ సోకినప్పటికీ లక్షణాలు తక్కువగా ఉండటం వల్ల తొందరగా గుర్తించే అవకాశం ఉండదని, నిర్లక్ష్యం చేస్తే వ్యాప్తి ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా విదేశాల నుండి వస్తున్న వారిని ఎయిర్ పోర్టులోనే క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి, అనుమానం ఉన్న వారిని ఐసోలేట్ చేసి తగిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Authorities were alerted to the arrival of 12,500 people from foreign to Andhra Pradesh in just ten days after December 1, but many phones were switched off, making it difficult to identify corona victims among them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X