ఆరోగ్యశ్రీ రూ 25 లక్షలకు పెంపు, లబ్దిదారులకు కొత్త కార్డులు - ఎలా పొందాలంటే..!!

సీఎం జగన్ మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితి రూ 25 లక్షలకు పెంచారు. ఇదే సమయంలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాలంటీర్లు..ఆరోగ్య సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లనున్నారు. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పించునన్నారు. మెరుగైన వైద్యం సులభతరం చేయనున్నారు.

ఆరోగ్యశ్రీ రూ 25 లక్షలు : ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య శ్రీ పరిమితిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు ఈ 25 లక్షల వరకు వైద్యం పొందేలా నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచారు. ఈ మేరకు కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాలనికి మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసేలా మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేయనున్న ఆరోగ్య శ్రీ కార్దుల్లోనూ మార్పులు చేసారు. ఈ కార్డుల జారీతో పాటుగా లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ వినియోగం పై అవగాహక కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Opinion: CM Jagan enhanced the coverage of healthcare scheme YSR Aarogyasri to Rs 25 lakh.

కొత్త కార్డుల జారీ : కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల్లో క్యూఆర్‌ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్‌ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేలా డిజైన్ చేసారు. ఎల్రక్టానిక్‌ హెల్త్‌ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్‌ఏ ఐడీ ఇవ్వనున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్‌ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు . ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు కల్పించారు. రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగేలా చేస్తూ..మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం అయ్యేలా నిర్ణయించారు.

Opinion: CM Jagan enhanced the coverage of healthcare scheme YSR Aarogyasri to Rs 25 lakh.

ఇంటింటికి సిబ్బంది : ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ద్వారా.. లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయించాలని వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం సూచించింది. దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తి అవుతాయి. ఈ మేరకు ప్రతీ ఇంటికి ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే రూ 25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్లే. దీని ద్వారా పేదల వైద్యానికి భరోసా ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+