సానుభూతి, పొత్తుల లెక్కలు - జగన్ ధీమా వెనుక, గెలుపెవరిది..!!

ఏపీ(AP)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు (Chandra Babu)అరెస్ట్ తో సానుభూతి..టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తు కలిసి వస్తాయని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి . జగన్(YS Jagan) ను ఓడించటం ఖాయమని పవన్(Pawan Kalyan) ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ మాత్రం తన నినాదం వై నాట్ 175కి కట్టుబడి ఉన్నారు. సాధ్యమేనా...జగన్ ధీమా వెనుక కారణం ఏంటి. ఎన్నికల వేళ ఏం జరుగుతోంది.

మారుతున్న లెక్కలు:ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఒంటరిగా వెళ్తే జగన్ ను ఓడించలేం..కలిసి కట్టుగా వెళ్లి ఎన్నికల్లో జగన్ ను ఓడించాలనేది చంద్రబాబు, పవన్ వ్యూహం. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఇప్పటి వరకు అంచనాలు కనిపించాయి.

Opinion: CM Jagan moving with big strategy to fix opposition in Diffence ahead Assembly Elections

కానీ, పవన్ తాజా ప్రసంగంతో బీజేపీ లేకుండానే..ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లేందుకు సిద్దమయ్యాయని స్పష్టం అవుతోంది. పొత్తు కారణంగా కలిసి వచ్చే సామాజిక సమీకరణాలు..2019 ఓటింగ్ లెక్కలతో రెండు పార్టీలు వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో ఒక్కసారిగా టీడీపీ లో కుదుపు వచ్చింది. ఈ సమయంలోనే పవన్ ముందుకొచ్చి పొత్తు ప్రకటించారు. టీడీపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాత నేతల స్పందన...వ్యవహార శైలి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యూహాత్మక అడుగులు:ఈ సమయంలోనే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. టీడీపీ నేతలు సైతం ఒక విధంగా తన వైపే చూసేలా వ్యవహరించారు. ఇక, జగన్ పాలన పైన సహజమైన రీతిలో విమర్శలు కొనసాగిస్తున్నారు.

అయితే, బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ ఆ పార్టీతో బంధం ఉన్నట్లా..లేదా అనేది మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే మరో అనుమానం వారిని వెంటాడుతోంది. జగన్ బలం..శక్తి గురించి ఇప్పుడు వైసీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ వివరిస్తున్నారు. జగన్ ను ఓడించాలనే ఉద్దేశంతోనే టీడీపీతో జత కట్టానని..తన అభిమానులు వివరణ ఇస్తున్నారు. అయితే, జగన్ మాత్రం తమ గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు సానుభూతి..పొత్తుల లెక్కల నడుమ కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు.

ఓట్ బ్యాంక్ పెంచుకొనేలా:తన ఓట్ బ్యాంక్ మరింత సుస్థిరం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ 2.35 లక్షల కోట్ల విలువైన పథకాల లబ్దిదారులు తనకు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. 1.98 కోట్ల మంది ప్రభుత్వ పథకాల లబ్దిదారులుగా ఉన్నారని అధికారులు లెక్క. అందులో రైతులే 52 లక్షలు ఉండగా, అమ్మఒడి లబ్దిదారులు 44 లక్షల మంది, వైఎస్సార్ భరసా లబ్దిదారులు 26.40 లక్షల మంది, వైఎస్సార్ ఆసరా కింద 40 లక్షల మందికి పైగా లబ్దిదారులు ఉన్నారు. 65 లక్షల మందికి ప్రతీ నెలా 1వ తేదీన పెన్షన్లు అందుతున్నాయి. ఇక, కొత్తగా ఎన్నికల సమయంలో వరలా ప్రకటనకు కసరత్తు జరుగుతోంది. ప్రతీ ఇంటికి మంచి చేసామనే నమ్మకం జగన్ లో విజయం పై ధీమా పెంచుతోంది. అదే ఎన్నికల నినాదంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ అంచనా వేసినట్లుగా సానుభూతి రాలేదనేది వైసీపీ చెబుతోంది.

Opinion: CM Jagan moving with big strategy to fix opposition in Diffence ahead Assembly Elections

పాజిటివ్ ఓట్ పై నమ్మకం:పొత్తు ప్రభావం మూడు జిల్లాల్లో పాక్షికంగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఇక, 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నారు. ఎన్నికల వేళ ప్రకటనకు మరిన్ని నిర్ణయాల పైన కసరత్తు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని..

తాను ఏం చెప్పినా చేసి తీరుతాననే విశ్వసనీయత తనకు కలిసి వస్తుందనేది జగన్ నమ్మకం. టీడీపీ జగన్ కు పోటీకి సంక్షేమ మేనిఫెస్టో తీసుకొచ్చినా స్పందన రాని అంశాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. దీంతో..మరింత పక్కగా సోషల్ ఇంజనీరింగ్..సంక్షేమం తమను గెలిపిస్తాయనేది వైసీపీ నేతల ధీమగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+