వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ - రైతుల మధ్య అదే సెంటిమెంట్ : 75 ఏళ్లకు మోక్షం - వరుస నిర్ణయాలతో..!!

|
Google Oneindia TeluguNews

భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్‌. కానీ, ముఖ్యమంత్రి జగన్ - రైతుల మధ్య సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కోసం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఇది మరసారి రుజువు అయిది. రాష్ట్రంలో 75 ఏళ్లు అయినా భూ రికార్డులు ఖచ్చితంగా లేవు. వాటిని సరి చేయటంతో పాటుగా.. రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాల్లోని 18,889 సర్వే నెంబర్లలో.. 35,669 ఎకరాల భూములు 22(ఏ) నిషేధిత జాబితాలో ఉండగా.. ఇప్పుడు వాటన్నింటినీ డీనోటిఫై చేస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రైతుల్లో సంతోషానికి కారణమవుతోంది.

మహాయజ్ఞంలా భూసర్వే

మహాయజ్ఞంలా భూసర్వే


రాష్ట్రంలోని భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. మహాయజ్ఞంలా భూసర్వే ప్రారంభించారు. ఇందు కోసం 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్‌ చేశారు. అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నారు. భూముల రీసర్వేతో రికార్టులను అప్‌డేట్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవంబర్‌లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. హద్దులు సరిచేసి హక్కు పత్రాలు ప్రభుత్వం అందచేయనుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు.

 22(ఏ) కింద నిషేధిత జాబితా కు మోక్షం

22(ఏ) కింద నిషేధిత జాబితా కు మోక్షం


90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో దాదాపుగా 355 గ్రామాల్లో 35,669 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం 22(ఏ) కింద నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా, సీఎం జగన్ ఆ భూములను డీనోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తక్షణం 22,042 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే వైఎస్సార్ రైతె భరోసా - పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని 50.92 లక్షల మంది రైతులకు ఏటా 13,500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందుతోంది. దీంతో పాటుగా ప్రతీ గ్రామ సచివాయలయం లోనే ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసారు. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో పరిహారం అందేలా విధి విధానాలు అమలు చేస్తున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రిష్ణా జిల్లాలోనే అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో సుమారు 16 వేల ఎకరాలు ఈ జాబితాలో వున్నాయి. నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయ, విక్రయాలకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటానికి సైతం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

 రైతు అనుకూల నిర్ణయాలతో

రైతు అనుకూల నిర్ణయాలతో


ఇప్పుడు ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలిగించి యజమానులకు అప్పగించింది. వీటికి సంబంధించిన పత్రాలను రైతులకు అందచేసిన ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాల‌న్నారు. త్వరలో భూసర్వే పూర్తి కావటం ద్వారా..భూ సమస్యల కోసం రెవిన్యూ కార్యలయాలు - కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఒక్కటి కూడా కరువు మండలం ప్రకటించకపోవటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా కరువు అనేదే రాష్ట్రంలో ఈ మూడున్నారేళ్ల పాలనలో కనిపించట లేదు. దీంతో, వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని రకాలుగా జరుగుతున్న మేలు గురించి ప్రభుత్వం ప్రతీ సందర్భంలోనూ గుర్తు చేస్తోంది.

English summary
AP Farmers Happy iwth CM Jagan decisions in favour of them, recently on denotifying the lands listed under 22a.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X