సీఎం జగన్ చెప్పారంటే చేస్తారంతే - వైఎస్సార్‌ రైతుభరోసా : రైతుల ఖాతాల్లోకి 23,875 కోట్లు..!!

జగన్ చెప్పారంటే చేస్తారంతే. పార్టీలో నమ్ముకున్న వారంతా ఇప్పటి వరకు చెప్పే మాట. ఇప్పుడు రైతుల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట పక్కగా అమలు చేస్తున్నారు. కరోనా .. ఆర్దిక కష్టాలు ఉన్నా వెనుకడుగు వేయలేదు. ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన అంశాల్లో తన తండ్రి కంటే రెండగులు ముందుకే వేస్తానని చెప్పిన విధంగానే ముందుకెళ్తున్నారు. వ్యవసాయం దండుగ అనే టీడీపీ ప్రచారం నుంచి వ్యవసాయం పండుగగా చేసి చూపిస్తామనే వైఎస్సార్ స్పూర్తితో జగన్ నాడు తన తండ్రి పేరుతోనే వైఎస్సార్ రైతు భరోసా ప్రకటించారు.

నాలుగేళ్ల పథకం అయిదేళ్లకు పెంపు

నాలుగేళ్ల పథకం అయిదేళ్లకు పెంపు

ఈ పధకం ప్రకటించే సమయంలో నాడు జగన్ నాలుగేళ్ల కాలంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ 12,500 చొప్పున ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ 50 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం పేరుతో తరువాత దీనిని అయిదేళ్ల కాలం అమలు చేయటంతో పాటుగా ఒక్కో విడతలో రూ 13,500 చొప్పున అందిస్తూ సంవత్సరానికి 13,500 చొప్పున రూ 67,500 మేర రైతులకు అందిస్తున్నారు. మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశారు. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి వారికి లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటున్నారు.

గత ప్రభుత్వానికి..ఇప్పటికీ తేడా ఇదేనంటూ

గత ప్రభుత్వానికి..ఇప్పటికీ తేడా ఇదేనంటూ


గత ప్రభుత్వంలో రైతు రుణ మాఫీ పేరుతో రూ 87,612 కోట్ల మాఫీకి హామీ ఇచ్చి..కేవలం రూ 15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసారు. అదే విధంగా ..ఈ మూడేళ్ల కాలంలో సీఎం జగన్ వైస్సార్ సున్నా వడ్డీ ద్వారా రైతన్నను ప్రోత్సహించేందుకు 1282 కోట్ల రూపాయాలు విడదల చేసారు. దీంతో పాటుగా ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసే లోగా పరిహారం అందించేలా నిర్ణయించారు. పరిహారం పొందే వారి జాబితాలను సంబంధిత సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హులు ఎవరైనా అందులో పేరు మిస్ అయితే..చేర్చుకొనే అవకాశం కల్పించారు. వైఎస్సార్ రైతు భరసా పథకం కింద 2019-20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు అందించారు. ఇక, 2020-21లో 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు అందించగా.. 2021-22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయం అందించారు. 2022-23లో 50.10లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చేందుకు నిర్ణియించారు.

50 లక్షల రైతు కుటుంబాలు..23,875 కోట్ల ప్రయోజనం

50 లక్షల రైతు కుటుంబాలు..23,875 కోట్ల ప్రయోజనం


అందులో భాగంగా వారికి మొదటి విడతగా తాజాగా 50,10,275 రైతు కుటుంబాలకు రూ.3,657.87 కోట్ల సాయం విడుదల చేసారు. రైతులకు మేలు చేసే అంశంలో గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని ముఖ్యమంత్రి జగన్ పదే పదే కోరుతున్నారు. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రైతులకు మేలు చేసే అంశంలో ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో కరువు కనిపించ లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లుగా ఉంది.

వివక్షకు..రాజకీయాలకు తావు లేకుండా..

వివక్షకు..రాజకీయాలకు తావు లేకుండా..


వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మే లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+