ఎన్నికల వేళ సీఎం జగన్ మరో సంచలనం - రుణమాఫీ ..?
ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెపిస్తుందని విశ్వసిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ వారి పపైన ఎన్నికల బ్రహ్మాస్త్రం సిద్దం చేస్తున్నారు.
సంచలన నిర్ణయం దిశగా జగన్:ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం 2019లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. కరోనా..ఆర్దిక ఇబ్బందులు వచ్చినా పథకాల అమలు ఆగలేదు.

ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పథకాల్లో చేరని వారి కోసం అవకాశం కల్పిస్తున్నారు. పార్టీలు.. రాజకీయాలకు అతీతంగా ఈ పథకాలు అమలు అవుతున్నాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమానికి పోటీగా తాజాగా టీడీపీ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఈ పథకాలను ప్రస్తుతం ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించారు.
ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా:సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ మరో కొత్త వరం ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందే రైతు రుణమాఫీ ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో హామీగా ఇస్తారా..ముందే అమలు చేస్తారా..ఎంత మేర చేస్తారు...

ఏ విధంగా ఈ పథకం అమలు విధి విధానాలు ఉంటాయనేది త్వరలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల్లో పెన్షన్లు...రైతు భరోసా మినహా మిగిలిన అన్నీ దాదాపు మహిళలకే నేరుగా లబ్ది జరుగుతోంది. మహిళలకు సంబంధించి ప్రతిపక్షాలు ఏం చెప్పినా తాను అమలు చేస్తున్న పథకాలను మించి చేయలేవని..చెప్పినా వారి మాటలకు విశ్వసనీయత లేదనేది సీఎం జగన్ నమ్మకం.
నిర్ణయిస్తే సంచనలమే:ఇప్పుడు రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా..ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీనిని అమలు చేయటం..లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. 2014 లో చంద్రబాబు...పవన్ కల్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లో షరుతులు పెట్టి..పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని...చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా పాజిటివ్ ఓట్ ను నమ్ముకున్న జగన్..ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల వేళ సంచలనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications