డిప్యూటీ స్పీకర్‌గా పద్మ: కెసిఆర్ ప్రశంసలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి పేరును స్పీకర్ మధుసూదనాచారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, విపక్ష నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అన్ని పార్టీల సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. న్యాయవాదిగా అపార అనుభవం ఉన్న మీరు టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాలశీలంగా వ్యవహరించారని అభినందించారు. పద్మాదేవేందర్‌రెడ్డిని సిఎం కెసిఆర్ ప్రశంసలతో ముంచెత్తారు.
చిన్నవయసులోనే ఉన్నతాస్థాయికి ఎదిగారన్నారు. తన బిడ్డగా చూసుకున్న బిడ్డ డిప్యూటీ స్పీకర్ అవడం మెదక్ జిల్లా వాసిగా గర్విస్తున్నాని అన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగీవ్రం కోసం సహకరించిన ప్రతిపక్షాలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తొలి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా మహిళ ఎన్నికకావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు.
అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ టి. శాసనసభలో చర్చ ప్రారంభమైంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ చర్చను ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రతిబింబించదన్నారు. ప్రభుత్వ కార్యాచరణ, భవిష్యత్‌లో అమలు చేసే పథకాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారన్నారు.

తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ
గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి పేరును స్పీకర్ మధుసూదనాచారి అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ
అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పద్మాదేవేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ
పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, విపక్ష నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, లక్ష్మణ్, అన్ని పార్టీల సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ తొలి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా మహిళ ఎన్నికకావడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ
పద్మాదేవేందర్‌రెడ్డిని సిఎం కెసిఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. చిన్నవయసులోనే ఉన్నతాస్థాయికి ఎదిగారన్నారు.

తెలంగాణ అసెంబ్లీ
తన బిడ్డగా చూసుకున్న బిడ్డ డిప్యూటీ స్పీకర్ అవడం మెదక్ జిల్లా వాసిగా గర్విస్తున్నాని అన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగీవ్రం కోసం సహకరించిన ప్రతిపక్షాలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ
అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ టి. శాసనసభలో చర్చ ప్రారంభమైంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ చర్చను ప్రారంభించారు.

తెలంగాణ అసెంబ్లీ
ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం 10 రోజులే అయ్యిందని, ఇంకా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదన్నారు. తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఘాటుగా సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications