జగన్‌ను సిఎం అడ్డుకోవడం లేదు: పాల్వాయి ఫైర్

Palvai Govardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డికి మతిభ్రమించిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రలో ప్రజాప్రతినిధుల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారని పాల్వాయి మండిపడ్డారు.

కాంగ్రెస్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారే నష్టపోతారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుతో ఎలాంటి ఒప్పందం జరగలేదని, భవిష్యతులో ఏమైనా ఉండవచ్చని పాల్వాయి అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. టిఆర్ఎస్ విలీనం కాకపోవడం వల్లే తెలంగాణ ఆలస్యమవుతుందనడం దారుణమని పాల్వాయి చెప్పారు. కృష్ణా జలాల నీటి కేటాయింపులో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం కనీసం ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల అభివృద్ధికి అందరూ పాటుపడాలని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్బంగా కోరారు.

టిడిపి, జగన్ పార్టీలపై మండిపడ్డ షబ్బీర్

రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పి, ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నాడని ఆరోపించారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను షబ్బీర్ అలీ గురువారం కలిశారు. తెలంగాణ ప్రాంతీయ సదస్సులపై దిగ్విజయ్ సింగ్ తనను అడిగారని షబ్బీర్ చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిపారు.

టి బిల్లును ఓడిస్తాం: శైలజానాథ్

తూర్పు గోదావరి: సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా తెలంగాణ బిల్లును అడ్డుకోవడంపైనే దృష్టి సారించారని మంత్రి శైలజానాథ్ తెలిపారు. గురువారం ఉదయం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తప్పకుండా ఓడిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజు విషయంపై తాను స్పందిచనని శైలజానాథ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+