పొన్నాల ఓటమి సిగ్గు చేటు: పాల్వాయి, జానారెడ్డి వల్లే

కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారకుడైన పొన్నాల లక్ష్మయ్య.. పిసిసి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పొన్నాలకు పార్టీని నడిపే శక్తి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పూర్తిగా విఫలమయ్యామని పాల్వాయి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురించేది కాదని అన్నారు.
కొందరు దురాశపరులు టిఆర్ఎస్ పార్టీతో పొత్తు అనవసరమన్నారని పాల్వాయి చెప్పారు. టిఆర్ఎస్‌తో పొత్తు లేకుండా చేసింది మాజీ మంత్రి జానారెడ్డి అని ఆరోపించారు. తన కూతురు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదన్న పాల్వాయి, పార్టీని బతికించడానికే పోటీ చేసిందని తెలిపారు. ఎంత వద్దన్నా వినకుండా చచ్చిపోయిన సిపిఐ పార్టీతో పెట్టుకున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసీ పోలవరంపై మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ తప్పుడు ప్రచారం చేశారని పాల్వాయి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్‌ను వెంటనే తప్పించాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications