వైసీపీ నేతకు చంద్రబాబు పిలుపు
నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కొద్దిరోజుల క్రితం ప్రజాగళం సభలో భాగంగా టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు, రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్న నాయకులంతా తమ పార్టీలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
సొంత గూటికి చేరా
చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనార్ధన్ రెడ్డితోపాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గెలుపునకు కృషిచేయాలని చంద్రశేఖర్ కు సూచించారు. 1994 లో తన సోదరుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపై(కాంగ్రెస్) పోటీచేశానని, ఇప్పుడు సొంత గూటికి చేరినందుకు ఆనందంగా ఉందని చంద్రశేఖర్ అన్నారు. బైరెడ్డి శబరిని, జానర్ధనరెడ్డిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అందుకు తగ్గ ప్రణాళికలను, వ్యూహాలను ఇప్పటినుంచే అమలు చేస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

జంపింగ్ జపాంగ్ లు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నుంచి ప్రతిక్ష పార్టీల్లోకి, ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. సీటు దక్కని నాయకులతోపాటు ఇతరత్రా కారణాలతో అసంతృప్తిగా ఉన్నవారంతా ఇప్పటివరకు ఉన్న పార్టీలను వదిలిపెట్టి ప్రత్యర్థి పార్టీల్లోకి వస్తున్నారు.
దీనివల్ల అప్పటివరకు సొంత పార్టీనే నమ్ముకొని ఉన్న విధేయులకు అవకాశాలు రావాని, వారంతా వెనకబడిపోతారంటూ ఆయా పార్టీల్లోనివారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ పార్టీకాపార్టీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విధేయులకే మొదటి అవకాశమని, వారందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications